వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్న బందరు కానిస్టేబుల్ జి. దుర్గారావు

-ఈ వారం వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్న బందరు తాలూకా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జి. దుర్గారావు
-కానిస్టేబుల్ దుర్గారావుకు సర్టిఫికెట్ అందజేసి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
-సముద్ర తీర ప్రాంతాలలో, మడ అడవుల్లో, గ్రామ శివారు ప్రాంతాల్లోని కాలవ గట్టు లపై ఏర్పాటు చేసుకున్న నాటుసారా స్థావరాలను వెలికి తీయడం లో తనదైన ముద్ర వేసుకున్న కానిస్టేబుల్
-ఇప్పటివరకు 100 పైగా నాటుసారా స్థావరాలను కనిపెట్టి ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ జి. దుర్గారావు
-ఇదే స్ఫూర్తి మరియు నిబద్ధతతో రాబోయే రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాలని సూచించిన జిల్లా ఎస్పీ
-వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్న కానిస్టేబుల్ కు తేనీరు అందించి, అతని యోగక్షేమాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ

విధులలో నిబద్ధత మరియు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విధి నిర్వహణకు గాను ప్రతివారం ఆ వారంలో సిబ్బంది కనబరిచిన ప్రతిభ ఆధారంగా బెస్ట్ వీక్లీ పర్ఫామెన్స్ అవార్డును జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు సిబ్బందికి అందజేసేలా వినూత్న ప్రణాళికలు రూపొందించారు. అంతర్గత స్పందన లో సిబ్బంది నుండి వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్నారని తెలుసుకొని, సిబ్బంది కనపరిచే పనితీరును బట్టి వారికి గుర్తింపు అందజేయాలని ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జి. దుర్గారావు (PC – 1213) కు ఈవారం బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అందించారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సర కాలంలో సుమారు 100 కు పైగా నాటు సారా స్థావరాలను కనిపెట్టి, 80వేల లీటర్ల పైగా బెల్లపు ఊటను ధ్వంసం చేయడంలో, 10 వేల లీటర్ల నాటుసారాను స్వాధీనపరచుకోవడంలో మరియు నాటు సారా తయారీదారులను, విక్రేతలను అదుపులోకి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ జి. దుర్గారావు ను ఈ వారం వీక్లీ బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డుకు ఎంపిక చేసి, ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు సత్కరించి, అవార్డును అందజేశారు.

ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా నిర్మూలనకై నిర్వహిస్తున్న ప్రత్యేక దాడులలో కానిస్టేబుల్ దుర్గారావు చాకచక్యంగా వ్యవహరిస్తూ, ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు నాటుసారా స్థావరాలను కనిపెట్టి, సదరు సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి వాటిని ధ్వంసం చేయడంలో మీరు చూపిన ప్రతిభ అభినందనీయమని, ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహం కనబరచాలని, మీకు ఏ సహాయం కావాలన్న మా వైపు నుంచి పూర్తిగా ఉంటుందని ఏ సమయంలోనైనా నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

అనంతరం ఎస్పీ గారు కానిస్టేబుల్ జి. దుర్గారావు తో మరియు పోలీసు అధికారులతో కలిసి తేనీరు సేవించి, ఆయన యొక్క కుటుంబ నేపథ్యం, యోగక్షేమాలు మరియు పోలీస్ శాఖలో కి ఎప్పుడు ప్రవేశించింది అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply