– హోం శాఖ మాత్యులు తానేటి వనిత
జి.కొత్తపల్లిలో జరిగిన గంజి ప్రసాద్ హత్య సంఘటన దురదృష్టకరం. వైఎస్సార్సీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తాం. ఈ రోజు బాధిత కుటుంబసభ్యులను జి.కొత్తపల్లి లో పరామర్శించడం జరిగింది. హత్యకు గురైన గంజి ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు.
హత్య కేసులో కొంతమంది వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బజారయ్య అనే వ్యక్తిపై కేసు
నమోదు చేశారు.బజారయ్య కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దిశా యాప్ ఉపయోగించుకోలేని చిన్నారుల భద్రత విషయం తల్లి చూసుకోవాలని మాత్రమే నేను చెప్పాను.ముందు వెనక కట్ చేసి వ్యాఖ్యలను ప్రసారం చేయడం సరికాదు.ఎవరు పదవికి పనికి వస్తారో తేల్చాల్సింది ప్రజలు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి.
దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో హోం శాఖ మాత్యులు తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే లు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.