Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌కు మహర్దశ

-అప్పుడు సోనియా బీసీ డిక్లరేషన్ సభ.. ఇప్పుడు రాహుల్ రైతు సంఘర్షణ సభతో కాంగ్రెస్‌కు మహర్దశ
– వరంగల్ రైతు సంఘర్షణ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగం

వరంగల్ రైతు సంఘర్షణ సభ తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. గత 2022లో వరంగల్ లో నిర్వహించిన సోనియా గాంధీ బిసి డిక్లరేషన్ బహిరంగ సభ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. చారిత్రాత్మక సభగా నిలిచింది. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈరోజు నిర్వహించిన వరంగల్ రైతు సంఘర్షణ సభ తొలి మెట్టుగా నిలుస్తుంది.

టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చి కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన ధాన్యానికి మద్దతు ధర, ప్రోత్సాహకాలు, రాయితీలు, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీ అన్నింటినీ బందు చేసి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు.

రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతున్న టీఆర్ఎస్ సర్కార్ కు బుద్ది చెప్పాడానికి రాహుల్ గాంధీ సభ.ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, ప్రజలకు సంపద పంచబడుతుందని ఆశీస్తే…. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన కొనసాగుతున్నది. ప్రజా సంపద 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, బలహీన వర్గాలు, గిరిజన ఆదివాసుల రైతుల సమస్యలు, పోడు భూముల పరిష్కారానికి వరంగల్ సభ డిక్లరేషన్ చేస్తుంది.

వరంగల్ సభ డిక్లరేషన్ లక్ష్యాలు, సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకువెళ్ళాలి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికులు గా పని చేద్దామని పిలుపునిస్తున్నాను.

LEAVE A RESPONSE