Suryaa.co.in

Telangana

అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

– ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తాం
గులాబీ పార్టీ రిమోట్‌ కమలం పార్టీ చేతిలో ఉంది
– పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం
– ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు
– తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను
– వరంగల్‌ డిక్లరేషన్‌ లో రాహుల్‌గాంధీ స్పష్టీకరణ

తెరాసతో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని సూచించారు. తెరాసపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు
rahul2 సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని సూచించారు.
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఏమన్నారంటే…

‘వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం. తెరాస, భాజపాతో కాంగ్రెస్‌ నేరుగా పోరాడుతుంది. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తాం. నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు. కాంగ్రెస్‌ విధివిధానాలను విమర్శిస్తే
rahul1 ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను. తెరాసపై నా పోరాటం కూడా కొనసాగుతుంది.’ తెరాస, భాజపా ఇప్పటికే కలిసి పనిచేశాయని… ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి తెరాస సహకరిస్తోందని విమర్శించారు. మోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే తెరాస సహకరించిందని మండిపడ్డారు. తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసని అన్నారు. తెలంగాణలో తెరాస అధికారంలో ఉండాలని భాజపా భావిస్తోందని… గులాబీ పార్టీ రిమోట్‌ కమలం పార్టీ చేతిలో ఉందని చెప్పారు.

ప్రజలు తెరాసకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని రాహుల్‌ గాంధీ అన్నారు. రెండుసార్లు అవకాశమిచ్చినా ప్రజల కోరిక నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ తప్పక నెరవేరుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ
తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ వరంగల్‌ డిక్లరేషన్‌ కచ్చితంగా అమలవుతుందని ప్రకటించారు. తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ సాకారమైందని ఈ సభలో రాహుల్ వెల్లడించారు. తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు
rahul3 తీరలేదని అన్నారు. తెలంగాణ ప్రజల కలలను ఈ సర్కార్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్‌ ఎంతో పోరాటం చేసిందని వెల్లడించారు. ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, కాంగ్రెస్‌ ఆశించిందేదీ నెరవేరలేదు. రైతుల సమస్యలను తెరాస ప్రభుత్వం వినిపించుకోవట్లేదు. దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకట్లేదు. చరిత్రాత్మకమైన వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఏ ఆశయంతో తెలంగాణ ఇచ్చామో అది సాధిస్తాం. ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తాం. వరంగల్‌ డిక్లరేషన్‌ కచ్చితంగా అమలవుతుందని హామీ ఇస్తున్నా.

LEAVE A RESPONSE