Suryaa.co.in

Telangana

కేటీఆర్ చెప్పేవన్నీ డ్రామాలే..

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివ్రుద్ధి
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిండు
ఓడిపోతే దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నడు
పెద్ద ఆదిరాల ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
తమ సంపాదనంతా కేసీఆర్ షాపు(లిక్కర్) కే పోతోందంటూ గ్రామస్తుల ఆవేదన
కేసీఆర్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ సమస్యలు ఏకరవు పెట్టిన స్థానికులు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ నారాయణపేటలో చెప్పినవన్నీ అబద్దాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రక్రుతి వనాలతోసహా గ్రామాల్లో చేపడుతున్న అభివ్రుద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ఒక్కో తలపై రూ.లక్ష అప్పు మోపారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మూటాముల్లె సర్ధుకుని విదేశాలకు పారిపొయేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా పెద్ద ఆదిరాల గ్రామంలో సాయంత్రం రచ్చబండ నిర్వహించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. నైట్ క్వార్టర్ కేమో రూ.80లు… లీటరు పాలకు రూ.25. మేమెలా బతుకుతామని గ్రామానికి చెందిన రైతు ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన బండి సంజయ్ మోడీ తర్వాత మోడీ అంటూ స్థానిక గ్రామ సర్పంచ్ అభివర్ణించారు.

3 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేకపోయామని, స్కూల్ లో స్కావేంజర్స్ ని కూడా తీసిపాడేశారని సర్పంచ్ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు అతుకుల గుంతలా ఉన్నాయని, బస్సును నడిపించే పరిస్థితి లేదని వాపోయారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్స్, ఉపాధి, ఏమి లేవని స్థానిక మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుటుంబం రోజు కష్టపడి పనిచేసి రూ.600 సంపాదిస్తే… కేసీఆర్ కే రూ.500(లిక్కర్) పోతున్నాయంటూ వారంతా వాపోయారు.
గ్రామస్తుల సమస్యలు సావధానంగా విన్న బండి సంజయ్ అనంతరం మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ బియ్యం ఎందుకు పేదలకు ఇవ్వడం లేదో నిలదీయండి.ప్రజలను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనే తప్ప మంచి చేయాలనే ఆలోచనే కేసీఆర్ కు లేదు. పేదలంటే కేసీఆర్ కు చులకన.

తెలంగాణకు 1.4 లక్షల ఇండ్లను మోదీ ప్రభుత్వం కేటాయిస్తే కేసీఆర్ పేదలకు ఏడేళ్లుగా ఒక్క ఇల్లు కట్టివ్వకుండా అన్యాయం చేస్తున్నడు.. తాను మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నడు.
ఇంటికో ఉద్యోగమిస్తా… నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇస్తానని ఆశ చూపిన కేసీఆర్ ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగమివ్వలే…కానీ కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలిచ్చి నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నరు.
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై రూ.లక్ష అప్పు మోపిండు. కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని తెలిసి దోచుకున్న సొమ్మునంతా విదేశాల్లో దాచుకుండు.. ఎప్పుడు ఓడిపోయినా మూటముల్లె సర్దుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నడు..

కరెంట్ బిల్లులు పెంచిండు.. బిల్లును చూస్తేనే షాక్ కొట్టేలా చేసిండు.. పొలం కాడ ఫ్రీ కరెంట్ అన్నడు..ఇంటికాడ బాదుతుండు.. పెట్రోలు ధరలపై కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్ పై రూ.30లు దొబ్బుతున్నడు…
గ్రామాల్లో అమలవుతున్న వైకుంఠధామాలు, మరుగుదొడ్లు, పల్లె ప్రక్రుతి వనాలు, రైతు వేదికలుసహా అన్ని అభివ్రుద్ది పథకాలకు కేంద్రమే నిధులిస్తోంది. కానీ కేటీఆర్ అనే డ్రామారావు నారాయణపేట లో మీటింగ్ పెట్టి కేంద్రం ఏమీ ఇస్తలేడని డ్రామాలాడుతున్నడు.. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తుండని అంటున్నడు..

ఏయ్.. మూర్ఖుడా? మీ అయ్య తెలంగాణ ప్రజలను మోసం చేసిండు కాబట్టే తిరుగుతున్న. చంద్రబాబుతో కుమ్కక్కై క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకుండా చేసిన దుర్మార్గుడు.
కరెంట్ మోటార్లకు బీజేపీ మీటర్ పెట్టాలని చెబుతుందంటూ అబద్దాలు చెబుతున్నరు.. కేసీఆర్ ఫాంహౌజ్ లో భూసార పరీక్షలు చేసి దొడ్డు వడ్లు పండిస్తున్నడు.. రైతుల భూముల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించడం లేదు?

కేసీఆర్ నెంబర్ వన్ ధోకేబాజ్…వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించడానికి నల్గొండ వెళితే రాళ్లతొ కొట్టించిండు.. బీజేపీ కార్యకర్తల రక్తంతో ధాన్యం తడిసేలా చేసిండు..
వడ్ల పైసలతోపాటు సుతిలీతాడు, రవాణా ఛార్జీలన్నీ చెల్లిస్తోంది కేంద్రమే… వరి తప్ప ఇంకేమి పండని పొలాల్లో ఇంకేమి వెయ్యాలి? వరి వేయాలని నేను చెప్పిన.. తెలంగాణ రైతులు పండించిన వడ్లన్నీ కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉన్నా… రైతులను అరిగోస పెడుతూ ఆ నేరాన్ని మోదీపై నెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు..

1400 మంది యువకుల బలిదానాలతో తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? పేదల త్యాగాలతో తెలంగాణ వస్తే పెద్దలు రాజ్యమేలుతున్నరు.కేసీఆర్ తాగి ఫాంహౌజ్ లో పడుకోవడానికి, కేసీఆర్ పిల్లలకు పదవులు ఇవ్వడానికేనా తెలంగాణ వచ్చింది?కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే… ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీయండి…
నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నా.. అబద్దాలు చెప్పే అలవాటు లేదు. ఓట్ల కోసం రాలేదు.. నేను చెప్పినవన్నీ వాస్తవాలో కాదో ఆలోచించండి… తెలంగాణకు నిధులిచ్చేది మోదీ… వడ్డించేవాడు కేసీఆర్ ఉండటంవల్లే ప్రజలకు ఆ సొమ్ము అందడం లేదు..

తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ నిలదీస్తే… ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ధర్నా చౌక్ కు వచ్చిండు.. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నా. ఎండ దెబ్బ తగిలినా.. కడుపు నొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పి వచ్చినా లెక్క చేయకుండా తిరుగుతున్నం…
టీఆర్ఎసోళ్లు ఓట్ల కోసం తప్ప ప్రజల వద్దకు ఎన్నడూ రావడం లేదు…ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి…. పేదోళ్ల రాజ్యం కావాలా?…. పెద్దోళ్ల రాజ్యం కావాలా?

LEAVE A RESPONSE