– జగనన్న కాదు… దున్నాఅనాలి
– పొరుగు రాష్ట్రంలో అత్యాచారం జరిగితే స్పందించి దిశాచట్టం తీసుకొచ్చానంటున్న వ్యక్తి, సొంతరాష్ట్రంలోని ఆడబిడ్డలను కామాంధులకు బలిచేస్తున్నాడు
– ఆడబిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి ఆపదవికి తక్షణమే రాజీనామాచేయాలి
• జగన్ ఏలుబడిలో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్ గా మారింది. మహిళలపై పూటకో అత్యాచారం, గంటకో అఘాయిత్యంతో దేశంలో ఏరాష్ట్రం సాధించని ఖ్యాతి పొందింది
• మహిళల రక్షణ విషయంలో జగన్ రెడ్డి దున్నపోతుమీద వానకురిసినట్టుగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో చివరకు మిగిలేది ఆయనా.. ఆయన పార్టీ పిశాచాలే
• మహిళల్ని కాపాడలేని ముఖ్యమంత్రిని, వైసీపీప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదు. ఆడబిడ్డలకు న్యాయంజరిగేవరకు టీడీపీ పోరాటం ఆగదు
• “ఊరికో ఉన్మాది” పుస్తకానికి కొనసాగింపుగా టీడీపీ త్వరలోనే మరోపుస్తకం విడుదలచేయనుంది
– టీడీపీమహిళానేతలు ప్రతిభాభారతి, వంగలపూడి అనిత, ఆచంటసునీత, కావలిగ్రీష్మ
అత్యాచారాలు, లైంగికవేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి సాధించిన ప్రగతి : ప్రతిభాభారతి
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం రాక్షసరాజ్యంగా మారింది. బంగారం లాంటి ఏపీ రౌడీలరాజ్యంగా, కిరాతకులు, కీచకులఅడ్డాగా మారింది. మహిళాసాధికారత నినాదంతో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకకార్యక్రమాలు చేపడితే, ఈ ముఖ్యమంత్రి పాలనలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా పూటకో అత్యాచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిస్థానంలో ఉన్నవ్యక్తే ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడలేకపోతే, ఇక ఈ రాష్ట్రంలోని మహిళల పరిస్థితేంటి? ఇళ్లల్లో ఉన్నఆడవాళ్లపై కూడా దారుణాలకు తెగబడుతుంటే ఇక ఎవరికి చెప్పు కోవాలి? పసిపిల్లలు, పండుముదుసలి అనే వ్యత్యాసం లేకుండా దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. ఈ ప్రభుత్వంలో బయటికి వచ్చిన 800అత్యాచార, మహిళలపై జరిగిన ఇతరత్రా ఘటనలకు సంబంధించి టీడీపీ ఒకపుస్తకం ముద్రించింది. దాన్ని టీడీపీవిభాగమైన తెలుగుమహిళ అధ్యక్షురాలు రాష్ట్రమహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు అందించారు. అయినా ఎలాంటిచర్యలులేవు. పోలీసుల రికార్డుల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు మహిళలకుజరిగిన వివిధరకాల ఘటనలకు సంబంధించి 2లక్షలవరకు కేసులునమోదు అయ్యాయి.
అయినాసరే ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. టీడీపీ హాయాంలో పల్నాడుప్రాంతంలో బాలికపై అత్యాచారంజరిగితే, నిందితుడు తనను పోలీసులు ఏంచేస్తారోనన్న భయంతో వణికిపోయి, తనకుతానే ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పుజరిగినవ్యక్తిని శిక్షించడానికి ఆనాడు చంద్రబాబుగారు వ్యవస్థలను పరుగులు పెట్టించారు. ముఖ్యమంత్రిస్థానంలోఉన్న వ్యక్తి అలాకఠినంగావ్యవహరిస్తే, తప్పుచేసేవాళ్లకు భయంఉంటుంది. అధికారపార్టీకి చెందినవారే ఆడబిడ్డలపై దారుణాలకుపాల్పడటం శోచనీయం. యథారాజా…తథాపరివారం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆడబిడ్డలు మృగాళ్ల దారుణాలకు బలవుతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటిబయటకురాడు. సిగ్గులేకుండా పోలీసులను కూడా ఏంజరిగినాపట్టించుకోవద్దని వైసీపీవారే చెబుతున్నారు.
టీడీపీ వ్యవస్థాపకులైన అన్ననందమూరి తారకరామారావు గారు మహిళలకు ఇచ్చిన భరోసా అంతాఇంతాకాదు. మహిళలకోసం అనేకకార్యక్రమాలు చేపట్టడమేకాకుండా, వారి ఉన్నతచదువులకోసం ప్రత్యేకంగా మహిళావిశ్వవిద్యాలయం నెలకొల్పారు. ఆస్తిహక్కులో మగవారితోసమానంగాఆడవారికి హక్కులుకల్పించారు. స్థానికసంస్థల్లో మహిళలకు 9శాతం రిజర్వేషన్ఇచ్చారు. ఎన్టీఆర్ గారు ఇచ్చినరిజర్వేషన్లనే తరువాత రాజీవ్ గాంధీగారు పెంచారు. మహిళలరక్షణకోసం చంద్రబాబుగారే మహిళాకమిషన్ నెలకొల్పారు. ఈ రాష్ట్ర్రంలో ఆడబిడ్డల తల్లిదండ్రులు, వారికుటుంబసభ్యులు తమబిడ్డలు బయటకువెళ్లి.. క్షేమంగా తిరిగొస్తారా అనే భయంతో బతుకుతున్నారు. లైంగికవేధింపుల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచేలా చేసినపాలకులు నిజంగా సిగ్గుపడాలి.
భారతదేశవ్యాప్తంగా చూస్తే, ఏపీ మానవ అక్రమరవాణాలో రెండోస్థానంలోఉంది. పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలోఉంది. జగన్మోహన్ రెడ్డి తనపాలనలో సాధించిన ప్రగతికి ఇవే కొలమానాలు. మహిళల్ని కాపాడటానికి చంద్రబాబుగారిఆదేశాలతో తాముచేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనేఉంటాము. రాష్ట్ర మహిళా కమిషన్ … దాని ఛైర్ పర్సన్ ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నారు. హోంమంత్రి ఏంమాట్లాడుతుందో ఆమెకే తెలియదు. మహిళకు హోంమంత్రి పదవిఇచ్చారని సంతోషించాలా..లేక ఏంమాట్లాడుతుందో తెలియని ఇలాంటిఆమెకు ఇచ్చారని బాధపడాలా? ఇలాంటి రాష్ట్రంలో మహిళాప్రతినిధులుగా, మాజీప్రజాప్రతినిధులమైన మేం ఉండాల్సివచ్చినందుకు చాలాచాలా బాధపడుతున్నాం. అసలు ఈప్రభుత్వం అసెంబ్లీని అసెంబ్లీలా నిర్వహిస్తోందా?
చట్టసభలో మాట్లాడాల్సిన భాష గురించి అవగాహనలేనివారంతా అధికాపార్టీ తరుపునప్రజాప్రతినిధులు. అబద్ధం అనేమాట వాడకూడదు.. సత్యదూరం అనాలి. అలాంటి పదాలు అనేకంఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులను కూడా హీనాతిహీనంగా దూషిస్తూ, నీచాతినీచమైన దరిద్రమైన భాషమాట్లాడే కుసంస్కారులు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబుగారిని రాజకీయంగా ఎదుర్కోలేని, చేవలేని చచ్చుసన్నాసులే వ్యక్తిగతదూషణలకు దిగుతున్నారు. రాజకీయంగా ఆయన్ని ఎదుర్కొంటే, ఎవరికిఎలా సమాధానంచెప్పాలో ఆయనకు బాగాతెలుసు. చట్టసభల్లో సభ్యులు ఎలా నడుచుకోవాలో తెలియచేస్తూ టీడీపీహాయాంలోనే ప్రత్యేకంగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటుచేయడం జరిగింది.
ఆ కమిటీదృష్టికి వైసీపీసభ్యుల హీనమైన మాటలు, దూషణలనుతీసుకెళ్లి, వారిపైచర్యలు తీసుకొని ఉంటేబాగుండేది. కానీ ఈ ప్రభు త్వం అదిచేయకపోగా, మరింత దారుణంగా వ్యవహరించింది. సభాగౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తే, తనపార్టీ వారిదూషణలు, వెకిలిచేష్టలను ప్రోత్సహిస్తున్నారు. చట్టసభల్లోని వారే అలా ప్రవర్తిస్తుంటే, కిందిస్థాయిలో ఉన్నఅధికారపార్టీ నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోతు న్నారుకాబట్టే ఆడబిడ్డలు, చిన్నారులు దినదినగండంగా బతుకుతున్నారు. ఒకరోజు కాకుం టే మరోరోజైనా ఈ ప్రభుత్వంపై ప్రజలు,మరీముఖ్యంగా మహిళలు తిరగబడటంఖాయం. మహిళాకమిషన్ ఉంది మహిళలను కాపాడటానికి..వారికి న్యాయచేయడానికిమాత్రమే.
ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడలేని వాడు సింహమా..? : వంగలపూడిఅనిత
రాష్ట్రంలో ఆడబిడ్డలపై నిత్యందారుణాలు జరుగుతున్నాయి… రోజు వాటిగురించే మాట్లాడటానికి మాకైనా బుద్ధుండాలి..అవిజరక్కుండా చూడాల్సిన పాలకులకైనా సిగ్గుండాలి. రాష్ట్రాన్ని నెంబర్ 1స్థానంలోఉంచుతానని గతంలో జగన్ రెడ్డి అంటే నిజంగానే అభివృద్ధిలో, ఉద్యోగాలు ఉపాధికల్పనలో తొలిస్థానంలో ఉంచుతాడేమో అనుకున్నాం. కానీ ఈ విధంగా అత్యాచారాల్లో, ఆడబిడ్డలపై వేధింపుల్లో అగ్రస్థానంలో నిలుపుతాడని ఎవరూఊహించలేదు. మహిళలపై జరిగే దారుణాల్లో రాష్ట్రం, ఆఖరికి బీహార్ ఉత్తరప్రదేశ్ ను కూడా దాటిపోయేలా చేస్తాడని కలలోకూడా అనుకోలేదు.
మూడేళ్లనుంచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతూపొంతూలేదు. ఏప్రియల్ 1నుంచి నిన్నటివరకు జరిగిన ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలఘటనలే 60కి పైగా ఉన్నాయి. ఇన్నిజరుగుతున్నా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏంచేస్తోంది? ఇదంతా ముఖ్యమంత్రి చేతగానితనమా… లేక ప్రభుత్వ బాధ్యతరాహిత్యమా? మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని జీర్ణించుకోవడమే కష్టంగా ఉంటే, పసిపిల్లలపై కూడాలైంగికవేధింపులు, అత్యాచారాలు జరగడం ఎంత నీచమో ఆలోచించండి.
5ఏళ్లు, 6ఏళ్లు, 7ఏళ్లచిన్నారులను కూడావదలకుండా దారుణాలుకు తెగబడుతుంటే దిగ్రేట్ అంబటికాంబాబు అదేకొత్తగా మంత్రిఅయిన వ్యక్తి చిన్నారిపై దారుణానికి పాల్పడిన వారితోమాట్లాడుతూ, సెటిల్ మెంట్ చేశారనివిన్నాం. చిన్నారిపై దారుణం జరిగితే మంత్రిస్థానంలోఉండి, తనకార్యాలయంలోనే సెటిల్ మెంట్ చేశారంటే ఆ మనిషిని ఏమనాలి? అలాంటి వాడు గంటా…అరగంటా అంటే బాధపడతాడా? అత్యాచారం జరిగినఘటనలు బాధితురాళ్లకు న్యాయంచేయరా అనిప్రశ్నిస్తే, ఆవ్యక్తికి నోటీసులుఇచ్చింది మహిళా కమిషన్. మహిళలరక్షణకోసం మహిళాకమిషన్ ఏర్పాటుచేసిన వ్యక్తికే సదరు కమిషన్ పేరుతో నోటీసులుఇవ్వడం దుర్మార్గంకాదా? ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ మంచి పద్ధతి కాదు.
అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించాల్సిన పాలకులే మానప్రాణాలకు ఖరీదు కడుతూ, మహిళల్ని అంగట్లో సరుకులా మారుస్తారా? తెలంగాణలో అత్యాచారం జరిగిందని దిశాచట్టం తెచ్చిన మొనగాడు, తనజిల్లాలో 15ఏళ్లబాలిక కామాంధుల పశుత్వానికి బలై, గర్భందాల్చితే ఏంచేస్తున్నాడు? ఏచట్టం తీసుకొచ్చి ఆబాలికకు న్యాయంచేయాలి? తనను గెలిపించిన సొంతరాష్ట్రం ఆడబిడ్డలపై జగన్ రెడ్డికి ఎందుకింతవివక్ష? ముఖ్యమంత్రి సొంతజిల్లాలో జరిగినఘటనను తాముబయటపెట్టేవరకు ఈ ముఖ్యమంత్రి, ఆయన పోలీస్ వ్యవస్థ ఏంచేశాయి?
పోలీస్ వ్యవస్థ, మహిళాకమిషన్ నిర్వీర్యమవడంవల్లే ఆడబిడ్డలకు ఈదుస్థితి. మహిళాకమిషన్ చైర్ పర్సన్ ని కలిసి “ఊరికోఉన్మాది” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపైజరిగిన అఘాయిత్యాల వివరాలతో ముద్రించిన పుస్తకమే ఇచ్చాము. అదిచూసి మహిళాకమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తుందని భావించాము. కానీ ఆమెనుంచి మాకు పిలుపేరాలేదు. ఎవరో స్పందిస్తారని ఏదో చేస్తారని తాము అనుకోవడంలేదు. మేమేకాదు.. ఈ రాష్ట్రంలోని ఏఆడబిడ్డాకూడా ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తమనుకాపాడతాయని నమ్మడంలేదు. బాధ్యతగల మహిళా ప్రతినిధులుగా, మరీముఖ్యంగా మహిళలగా తాము ఈప్రభుత్వదుర్మార్గాలు, ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎండగట్టాలనే నిర్ణయించుకున్నాం.
హోంమంత్రి కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో స్త్రీలపై రోజుకి 2, 3ఘటనలు జరుగుతున్నాయి. ఊరికో ఉన్మాది పుస్తకానికి కొనసాగింపుగా ఊరికో ఉన్మాది 2వ సంపుటి టీడీపీ విడులచేయనుంది. బుద్ధి జ్ఞానం లేనివాళ్లంతా జగన్ ను సింహంతోపోలుస్తున్నారు. ఆడబిడ్డ మానప్రాణాలు కాపాడలేని వాడుసింహమా? ఆడవాళ్లను కాపాడలేని ముఖ్యమంత్రి కనీసం వారికి గన్ లైసెన్స్ అయినా ఇప్పిస్తే వారిని వారు కాపాడుకుంటారు. జగన్ రెడ్డి అండతో పేట్రేగిపోతున్న ఉన్నాదులకు, వారిని రక్షిస్తున్న వారికి టీడీపీ ప్రభుత్వం రాగానే తాటఊడటం ఖాయమని హెచ్చరిస్తున్నాను.
జగనన్న కాదు… దున్నాఅనాలి : ఆచంటసునీత
వైసీపీ కామాంధులపార్టీ. జగనన్న జగనన్న అనడంకాదు.. దున్నఅనాలి. వర్షంపడుతున్నా… ఎండకాస్తున్నా ఏమీ స్పందించకుండా, చలనంలేకుండా ఉంటాయని గ్రామాల్లో దున్నపోతుల్ని అంటూంటారు. రాష్ట్రంలోవరుసగా ఆడబిడ్డలు దుర్మార్గుల రాక్షసత్వానికి బలిఅవుతున్నా, కించిత్ స్పందనకూడాలేకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలో సాటిమహిళలే చెప్పాలి. గుడి, బడి, ఆసుపత్రి, రోడ్డు, ఇల్లుకాదేదీ అత్యాచారానికి అనర్హం అన్నట్టుగా ఏపీలో పరిస్థితి తయారైంది. చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ గా విరాజిల్లితే, జగన్ రెడ్డి వచ్చాక మద్యాంధ్రప్రదేశ్, అత్యాచారాంధ్రప్రదేశ్, గంజాయాంధ్రప్రదేశ్ గా మారింది.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై 1500లకు పైగా ఘటనలు జరిగితే ముఖ్యమం త్రి ఏనాడైనా కనీసం బాధితురాళ్లను పరామర్శించలేదు. పరామర్శసంగతి తరువాత.. కనీసం సాటిమనిషిగా కూడా ఆయన స్పందించలేదు. అదే ఈరాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ దౌర్భాగ్యం. ఆయన వ్యవహారశైలి అలాఉంటే, అత్యాచారాలు యాధృచ్చికంగా జరుగుతూ ఉంటాయని, తల్లులపెంపకం సరిగాలేదని మాట్లాడుతూ హోంమంత్రి మరింత అభాసుపాలవుతున్నారు. మహిళా ఉండి, తల్లిపాత్రను నిందించడం, వారిపెంపకాన్ని తప్పుపట్టడం ఆమెకే చెల్లింది. హోంమంత్రిస్థానంలోఉండి, సాక్షిఉద్యోగి రాసిచ్చిందే చదువుతున్న ఆమె తనవ్యక్తిత్వాన్ని కోల్పోతోంది.
తను ఉన్న స్థానానికి, తనమాటలకు ఎక్కడా పొంతనలేదు. మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ అత్యాచార బాధితురాళ్లకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారచెక్కులు మోయడానికే పరిమితమయ్యారు తప్ప, ఆడబిడ్డలకు న్యాయం చేయలేకపోతోంది. వైసీపీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలుసహా, అందరూ ఆడవాళ్లను ఆటవస్తువుల్లానే చూస్తున్నారు. ఆడబిడ్డలను కన్నెత్తిచూస్తేనే మా అన్న గుడ్లుపీకేస్తాడు అంటూ ఒకామె గతంలో పెద్దగొంతేసుకొని పడిపోయేది… ఆమె, ఆమెచెప్పిన అన్నకు ఆడబిడ్డలవేదన వినిపించడంలేదా? రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిన అఘాయిత్యాలు కనిపించడంలేదా? మహిళల్ని కాపాడలేని ఈ చేతగానిసీఎంని నమ్ముకునేకంటే, ఆడవాళ్లు ఎవరికి వారు వ్యక్తిగతంగా స్వీయరక్షణ చర్యలుపాటిస్తే మంచిదని సూచిస్తున్నాం. మహిళల మానప్రాణాలకోసం ఎంతటిపోరాటానికైనా టీడీపీ సిద్ధం. ప్రత్యేక కార్యాచరణతో ఈ ప్రభుత్వ చేతగానితనాన్ని, ముఖ్యమంత్రి అసమర్థతను ఎండగడతాం.
రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతుంటే ముఖ్యమంత్రికి నిద్రఎలా పడుతుంది? : కావలి గ్రీష్మ
ముఖ్యమంత్రి, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్, హోంమంత్రికి నిద్రఎలా పడుతుందో తెలియడంలేదు. రాష్ట్రంలోకేవలం నెలరోజుల్లోనే 60కిపైగా అత్యాచారాలుజరిగితే వారికి కంటిమీదకునుకెలా వస్తుంది? మెదడు మొద్దుబారిపోయే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారాపార్టీవారు ఇలా ప్రవర్తిస్తున్నారు. మానసిక వికలాంగురాలిని పట్టపగలు, ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారంచేస్తే, ఈ ప్రభుత్వం ఏంచేసింది? ఆడబిడ్డల రక్షణకోసం మహిళాకమిషన్ తీసుకొచ్చిన నాయకుడికే నోటీసులు ఇస్తారా? ఆడబిడ్డల రక్షణ ప్రభుత్వబాధ్యతకాబట్టి మాట్లాడుతున్నాం.
ముఖ్యమంత్రి కాపాడతాడనే నమ్మకం మాకేకాదు.. ఏపీలో ఉన్న ఏ ఆడబిడ్డకు లేదు. మహిళల్ని కాపాడలేని ముఖ్యమంత్రి కనీసం వారికి గన్ లైసెన్స్ లు అయినా ఇవ్వాలి. అదికూడా చేయలేకపోతే రేపట్నుంచి ప్రతిమహిళా వారితోపాటుగా కారంపొట్లాలు, పెప్పర్ స్ప్రేలు ఉంచుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో జేబ్రాండ్ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు పెరగబట్టే, అత్యాచారాలు పెరిగాయి.
టీడీపీ హయాంలో దినపత్రికల్లో అభివృద్ధి, ఉద్యోగాలకల్పన గురించి రాస్తే, ఈ ముఖ్యమంత్రి హయాంలో అ త్యాచారాలు, హత్యలు జాబితా రాస్తున్నారు. గడపగడపకు అంటూ వెళ్తున్నవారందరికీ ఆడవాళ్ల చెప్పుదెబ్బలే గతి. ఆడబిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి కనీసం వారికి గన్ లైసెన్స్ అయినా ఇస్తే మంచిది. జగన్ రెడ్డిఇలానే బండరాయిలా ఏంసంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తే, రాష్ట్రంలో చివరకు మిగిలేదిఆయన, ఆయన పార్టీకి చెందినపిశాచాలే. ఆడబిడ్డలను గాలికివదిలేసి, వారిజీవితాలను కాపాడలేని ముఖ్యమంత్రి, హోంమంత్రి, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్లు తక్షణమేవారి పదవులకు రాజీనామాచేయాలి. ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలు… వేధింపులకు అడ్డుకట్టవేసి, ముఖ్యమంత్రి ఆడబిడ్డలకున్యాయంచేయాలి. జగన్ రెడ్డి మహిళలకు న్యాయం చేసేవరకు వారిరక్షణకోసం చేస్తున్న తమపోరాటం ఆగదు.టీడీపీ మహిళానేతల విలేకరులసమావేశంలో మహిళానేత అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు.