ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు భయపడమని సాయినాథ్ శర్మ స్పష్టం చేశారు. రాజకీయాలు మానుకోవాలని లేఖలు పెట్టడం పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు. రేపు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వాస్తవాలు వారే తేలుస్తారని స్పష్టం చేశారు.