అగ్ర దేశాధ్యక్షుల వారికి..
ప్రపంచాన్ని
నాశనం చేయడానికే
మీ తెలివి తేటలన్నీ..
ఖర్చు చేసేస్తే ఎలా..?!!
మీ మనశ్శాంతిని
కాపాడుకోవటం కోసం..
కొంచెం అయినా మిగుల్చుకోండి మిత్రమా!
ఆ బూడిదైపోయిన ప్రపంచంలో..
మీరు మాత్రం ఏం చేస్తారు..
ఆ బూడిద లో
మీరు కూడా భాగమైపోతారు కదా!
ఎవరైనా కొంచెం చెప్పండయ్యా!
గుట్టు విప్పండయ్యా!
ఆ మానసిక రోగుల్ని
గద్దె దించడయ్యా
– కర్షక పుత్రఃకమ్మని మిత్రః