• జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వనిర్ణయాలు రాష్ట్రరైతాంగం నడ్డివిరగ్గొడుతున్నాయి. ఈ-క్రాప్ నమోదులోని పొరపాట్లు ధాన్యంరైతులకు గ్రహపాట్లుగా మారాయి
క్వింటాధాన్యం కొనుగోలులో కూలీ, గోతాలు, రవాణాఛార్జీలపేరుతో రైతునుంచి రూ.400వరకు దోచుకుంటున్నారు
• రైతుల్నిఉద్దరిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ రెడ్డి, ఏనాడైనా సాగుసీజన్లకు ముందు వ్యవసాయ, జలవనరులశాఖాధికారులతో సమీక్షచేశాడా?
అన్నతీరుగా మారాయి.
• విద్యుత్ వాడకం తేల్చడానికే రైతులమోటార్లకు మీటర్లు అన్న ప్రభుత్వవాదన పచ్చిఅబద్ధం.
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
ప్రకృతివైపరీత్యాలు, చీడపీడలు, అకాలవర్షాలు, కల్తీవిత్తనాలు, ఎరువులతో రైతులు నష్టపో వడాన్నిచూశామని, కానీ ఒకవ్యక్తి, ప్రభుత్వనిర్ణయాలు రైతులకుశాపంగా మారడం ఏపీలోనే చూస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రరైతాంగం నడ్డివిరగ్గొట్టేలా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటిరాజేంద్రప్రసాద్ ఆరోపించారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
“ఈ-క్రాప్ నమోదులో ప్రభుత్వంనిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, దానిలోజరిగిన పొరపాట్లు, రైతులకు గ్రహపాట్లుగామారాయి. గతంలో ఏప్రభుత్వం ఉన్నాకూడా, గ్రామాలవారీగా రైతులవివరాలు, భూములవివరాలు, వారువేస్తున్నపంటలవివరాలు, సమగ్రంగా సేకరించి, వాటికితగినట్లుగా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగేది. అలాంటి సమాచారాన్నిపట్టించుకోకుండా, వాస్తవాలను పక్కన పెట్టి, రైతులగోడుపట్టించుకోండా ఈప్రభుత్వం వ్యవహరిస్తోంది.
తెనాలి డివిజన్లోనే గతంలో అనే కమండలాల్లో తానుపర్యటించి, రైతులతోస్వయంగా మాట్లాడటం, వారిఅభిప్రాయాలు, బాధ లు తెలుసుకోవడంజరిగింది. ధాన్యంసేకరణ, అమ్మకాలపేరుతో రాష్ట్రంలో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని స్వయంగా అధికారపార్టీ ఎంపీనే చెప్పారు. ధాన్యంకొనుగోళ్లలో వైసీపీనేతల అక్రమాలు, అవినీతిపెరిగాయని ఆయనేవాపోయారు. సర్వేనెంబర్లప్రకారం ఈక్రాప్ లో నమోదుచేసిన వివరాల్లో కేవలం 60శాతంమాత్రమే సమాచారాన్ని సేకరించారు. మిగిలిన 40శాతంవివరాలు సంపూర్ణంగాలేవు. అలానే సదరు40శాతం భూమికి సంబంధించిన వివరాలన్నీ తప్పులతడకలే.
చాలాప్రాంతాల్లో సర్వేనంబర్లుకూడా సరిగాలేవు. క్షేత్రస్థాయిలో రైతులవివరాలు, వారిపంటల వివరాలకు,ప్రభుత్వం నమోదుచేసిన వివరాలకుఎక్కడా పొంతనలేదు. క్వింటా ధాన్యం రూ.1370లకు కొనాల్సిఉంటే, ఎక్కడా ధాన్యంరైతుకి ఆమొత్తం సరిగా అందడంలేదు. తక్కువధరకు ధాన్యంకొంటున్న ప్రభుత్వం దానితాలూకా సొమ్ముని కూడా నెలలతర బడిచెల్లించడంలేదు. ధాన్యంకొనుగోళ్లలో ఎప్పుడూలేనివిధంగా హామాలీ (కూలీ) ఛార్జీలు, ధాన్యంగోతాలఛార్జీలు, రవాణాఛార్జీలపేరుతో ఒక్కోక్వింటాల్ కు రూ.400 నుంచి రూ.500 వరకురైతులనుంచి వసూలుచేస్తున్నారు.
తొలుతప్రభుత్వమే నేరుగా రైతులవద్దకువెళ్లి, కల్లాల్లోని ధాన్యంకొంటుందని చెప్పినవారు, తరువాత ఆర్ బీకే ల్లో (రైతు భరోసా కేంద్రాలు) ధాన్యంకొంటామని చెప్పారు. ధాన్యంకొన్న తరువాత కేవలం7రోజుల్లోనే రైతులకు డబ్బులిస్తామని ముందుచెప్పారు, తరవాత ఆగుడువు21రోజులకు పెంచారు. ఇప్పుడు 6, 7నెలలు గడిచినాకూడా ధాన్యంరైతులకు ఈప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. ఈవిధంగా రైతులుతీవ్రంగా నష్టపోతున్నాకూడా ముఖ్యమంత్రి మాత్రం బహిరంగ వేదికలపై రాష్ట్రరైతాంగాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నాడు. వడ్డీలేనిరుణాలు ఇస్తున్నామనిచెబుతున్న ముఖ్యమంత్రి, తనపాలనలో ఎంతమంది రైతులకు పైసావడ్డీ లేకుండా పంటరుణమిచ్చాడో చెప్పాలి.
వడ్డీలేనిరుణాలసంగతి దేవుడెరుగు.. పంటనష్ట పోయిన రైతులెందరు… ఎంతమందికి సకాలంలో పరిహారంఇచ్చాడో జగన్ రెడ్డి చెప్పగలడా? ఈ మూడేళ్లలో రైతులు దాదాపు8సార్లు పంటనష్టపోతే, ఎన్నిసార్లు, ఎందరురైతులకు, ఎన్నిలక్షలఎకరాలపంటకు, పంటనష్టపరిహారం కింద ముఖ్యమంత్రి అన్నదాతలను ఆదుకున్నాడో సమాధానంచెప్పాలి? రైతులకు ఇన్నికోట్లు ఇచ్చామని పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తున్న జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ఎందరు రైతులకుఇచ్చారో, అర్హులైన రైతులెందరో ఎందుకు చెప్పడం లేదు? ఈప్రభుత్వంలో ఎకరాకు రూ.30, రూ.40ల పంట నష్టపరిహారం పొందిన రైతులున్నారు.
జూన్ నెలనుంచి మూడుపంటలకు నీళ్లిస్తాము… పంటలువేసుకోండి అంటున్న ప్రభుత్వం, రైతులు ఎలాంటిపంటలువేయాలి… ఎంతవిస్తీర్ణం సాగుచేయాలి..దానికి అవసరమైన విత్తనాలపంపణీఎలా అనేదానిపై ఎప్పుడైనా సమీక్షచేసిందా? వ్యవసాయ విధానం-రైతులసాగుకి సంబంధించి జలవనరులశాఖ, వ్యవసాయశాఖల మంత్రులు, అధికారులుకలిసి ఎప్పుడైనా ఉమ్మడిసమావేశం నిర్వహిం చారా? మూడేళ్లలో ఆరెండుశాఖలతో ముఖ్యమంత్రి ఏనాడైనా ఖరీఫ్, రబీసీజన్లకు ముందు ఒక్కరోజైనా సమీక్ష చేశాడా? ఎంతసేపూ రైతు భరోసా కేంద్రాల భజన తప్ప, ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం రైతులకు చేస్తున్నది శూన్యం.
ఇతర రాష్ట్రలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్న రైతుభరోసాకేంద్రాలు పేరుగొప్ప-ఊరుదిబ్బ అన్నతీరుగా తయారయ్యాయి. బస్తాయూరియాకోసం రైతులు గంటలతరబడి ఆర్బీకేలముందు క్యూలైన్ల లో నుంచున్న సందర్భాలు కోకొల్లలు. అలాంటి ఘటనలు ఏవీ ముఖ్యమంత్రికి తెలియదా? వైసీపీనేతలే కృత్రిమకొరతసృష్టించి, యూరియాకోసం అన్నదాతలు బయట వ్యాపారుల చుట్టూతిరిగేలా చేయడంలేదా? ఇతరకాంప్లెక్స్ ఎరువులుకొంటేనే యూరియా ఇస్తామని ప్రైవేట్ వ్యాపారులు నిబంధనలుపెట్టి, బలవంతంగా రైతులకు ఇతరఎరువులు అంటగడు తున్నా, వ్యవసాయ శాఖాధికారులు చోద్యంచూస్తూ కూర్చోలేదా?
రాష్ట్రవ్యాప్తంగా పండిప పంటఉత్పత్తుల్లోకేవలం 20శాతంమాత్రమే ఈప్రభుత్వంకొన్నది నిజంకాదా? మిగిలిన పంటఉత్పత్తులను అమ్ముకోవడానికి అన్నదాతలు నానాగడ్డీ కరిచింది వాస్తవం కాదా? గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలు, డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులుఅందిస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటన్నింటికీ మంగళంపాడింది నిజంకాదా? రైతులమోటార్లకు ఈ ప్రభుత్వం మీటర్లు ఎందుకు బిగిస్తోందో చెప్పాలి. విద్యుత్ వాడకం లెక్కలు తేల్చచడానికి మీటర్లు బిగిస్తున్నామని చెప్పడం ముమ్మాటికీ పచ్చిఅబద్ధం.
రైతులువాడుకునే విద్యుత్ లెక్కలు తేల్చడానికి విద్యుత్ సరఫరాసంస్థలు, సబ్ స్టేషన్లు పనికిరావా.. వాటిద్వారా తేల్చలేరా? గతప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేకసంస్కరణలు తీసుకొచ్చి, సరఫరాలో జరిగే నష్టాలను నివారించింది. రైతులకు సకాలంలో చెప్పిన సమయా నికి ఉచితవిద్యుత్ అందించింది. జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ఇప్పటికైనా ఈక్రాప్ నమోదు పేరుతో వైసీపీ నేతలు, అధికారులు చేస్తున్న మోసాలను అరికట్టి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకుకన్నీళ్లు, కష్టాలుమిగిల్చి, వారినిదోచుకుంటున్న పాలకులకుత్వరలోనే అన్నదాతలు, నాగళ్లతో నడ్డివిరగ్గొట్టి, కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయ మని హెచ్చరిస్తున్నాం.”