-జగన్ దావోస్ పర్యటనపై అనుచర వర్గంతో విషం కక్కిస్తున్న బాబు
-రాహుల్ గాంధీ ‘పార్టీ’టైమ్ పొలిటీషియన్
-ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయంలో పెట్టుబడుల పేరుతో దావోస్ వెళ్లి అక్కడ మెస్ నడిపి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని వైఎస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పలు అంశాలపై ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చంద్రబాబు చిన్న పాలేరు పట్టాభి ముఖంనిండా కుళ్లు పులుముకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల డబ్బు దాచేందుకు, స్విస్ బ్యాంకర్లను ప్రసన్నం చేసుకునేందుకే చంద్రబాబు 18సార్లు అక్కడికి వెళ్లారన్న విషయం దేశమంతా తెలుసని అన్నారు. గతంలో చంద్రబాబు దావోస్ పర్యటనపై పచ్చమీడియా అతి బిల్డప్పలతో ప్రజలపై రుద్దేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దశాబ్దాలపాటు కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఓటు అక్కడ లేదని చెప్పారు. కుప్పంలో ఎన్నికల సమయంలో రిగ్గింగ్ కోసం వేల మంది తమిళుల్ని దొంగ ఓటర్లుగా చేర్పించాడని మండిపడ్డారు. కృష్ణ నదీ కరకట్ట ఇంటికే ఓటును మార్చుకున్నాడుగానీ కుప్పం వైపు కన్నెత్తి చూడలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ..ఇంతకూ కుప్పంలో ఇల్లు కట్టుకుని ఉంటావా లేక ఎన్నికలయ్యాక అమ్మేస్తావా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయ వేత్త మాత్రమే కాదని, విదేశాల్లో ఎక్కువ సమయం పార్టీలు చేసుకునే ‘పార్టీ’ టైమ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. లండన్లో భారత ప్రభుత్వంపై రాహుల్ చేసిన విమర్శలు ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అతను తన ఇటాలియన్ గాజులను తొలగిస్తే, అతను కాంగ్రెసేతర పాలనలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అభివృద్ధిని చూడవచ్చని అని చెప్పారు.