మేము పాలకులం పరమ పవిత్రలం
దేశ రక్షకులం జై హింద్
జై భారత్ భారత్ వెలిగి పోతోంది అని
ప్రకటనలు ఇచ్చుకుంట్టం
మేమే చీలి పోతాం
ఒకరం హిందువుల వైపు
ఒకరం ముస్లింల వైపు
ఒకరం క్రిస్టియన్స్ వైపు
వంత పాడుతాం
ఎన్నికలొస్తున్నాయి అంటే
బాబ్రీ మజీద్,రామ మందిరం
లేదంటే పాకిస్థాన్ తో
పంచాయతీ ముందేసుకుంటాం
సర్జికల్ స్ట్రైక్లు చేస్తాం
వాగ్ధానాల జల్లు కురిపిస్తాం
కుల భక్తినో మత భక్తినొ
దేశ భక్తినొ,లేదంటే వాగ్ధానాల
వరదనో ఓట్లు రాలుస్తుంది
కరోన ఇండియాను ఏమి
చేయలేదని చెప్పి
ప్రపంచం ముందు కాలర్
ఎగిరెసాం చప్పట్లు కొట్టించామ్
దీపాలు వెలిగించాం
ప్యారాసేటిమలో,బ్లీచింగ్ పౌడరో
వేసేస్తే పోతుందన్నాం
కేంద్రం మీద రాష్ట్రం
రాష్ట్రం మీద కేంద్రం
ఒకరి మీద ఒకరం నెపం పెట్టుకున్నాం
పది కోట్ల కూలీలను ఏడిపించాం
వందల కిలోమీటర్లు నడిపించాం
కాలి నడకలో భారత కార్మికుల శక్తి
ప్రపంచానికి చూపించాం
గిన్నిస్ బుక్ మాత్రమే కాదు
దాని మదర్ బుక్ ఉన్నా
ఈ ప్రపంచ రికార్డ్ ఎక్కి తీరాలిసిందే
ఎలక్షన్స్ ఉంటే మాత్రం
వలస కూలీల కాళ్ళు మొక్కైనా
కార్లు పెట్టి తీసుకెళ్లేవాళ్ళం
మేము పాలకులం పరమ నీతి పరులం
ఉస్సారైన ఊసరవెల్లులం
ఓటు వేయడానికి తప్ప ఎందుకు
పనికిరాడు 90ml లిక్కర్ మొఖాన
పడేస్తే జండా మోస్తాడు ఓటు వేస్తాడు
ఐదు సంవత్సరాలకు ఒక మారు
మేము పాలకులం పరమ పవిత్రులం
టీవీ చానళ్లు మావే
న్యూస్ పేపర్లు మావే
కులాన్నో మతాన్నో
రూపాయినో ఎరగా వేస్తాం
భజన పరల్ని తయారు చేస్తాం
పేదల కోసమే పాంహౌసుల్లో
ప్యాలెసుల్లో బ్రతుకుతాం
పేదల కోసమే పారిన్ కారుల్లో
షికార్లు చేస్తాం
పేదల కోసమే మా పిల్లలను
మంత్రులను చేస్తాం
పేదల కోసమే పార్టీలు మారుస్తాం
పేదల కోసమే భార్యల పేర్లతోనో
బామ్మర్దుల పేర్లతోనో
వందల ఎకరాలు రాసుకుంటాం
పేదల కోసమే గల్లీ గల్లీకి బార్ షాపులు
తెరిసాం
మేము పాలకులం పరమ పవిత్రులం
దేశం వెలిగిపోతోంది………
-ప్రవీణ్ కుమార్ నారగోని