అమలాపురం ఘటనలో ప్రభుత్వ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకవైపు వాళ్ల మంత్రి , ఎమ్మెల్యే ఇల్లు తగలబడి పడిపోయాయి. అవమాన భారంతో కుంగిపోతున్నారు .ఇంకోవైపు ప్రజలలో ప్రభుత్వానికి కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో సామాన్య ప్రజల నుండి మద్దతు లభించక ,దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమి చేయాలో తేలియక తలపట్టుకున్న పరిస్థితి.
ఇంకొకవైపు ప్రభుత్వానికి ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోయాము, పోలీస్ వ్యవస్థ అట్టర్ ఫెయిల్ అయింది అని ప్రజలు అనుకుంటున్నారు .ఇతర పార్టీల మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేసి వికటించి వారి మీదనే పడి చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది .
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, పోలీసులను పూర్తిగా కంట్రోల్ లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద.. అయిన దానికి ,కాని దానికి కేసులు పెట్టించి భయభ్రాంతులను చేస్తున్న పరిస్థితుల్లో, సాధారణ ప్రజలు చేత పోలీసులను ,ఎస్పీని ,డి ఎస్ పి లను సైతం రాళ్లు రూవించు కొని దెబ్బలు తగిలించుకొని భయపడి ప్రక్కకు తప్పుకున్న పరిస్థితి వచ్చింది .
దీనిని బయటకు చెప్పుకోలేక, జరిగిన సంఘటనలన్నీ మీడియా ద్వారా బయటకు తెలిసి, ప్రభుత్వ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక సామెత లాగ అయిపోయింది .పోనీ పోలీసులు ఎదిరిస్తే ప్రజలు తిరగబడ్డారు అని ప్రచారం చేద్దాం అంటే ప్రజలు నమ్మరు.
ఎందుకంటే పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను,సామాన్య ప్రజలను మీ రాజకీయ ప్రాబల్యం కోసం భయబ్రాంతులకు చేసిన సంఘటనలు కోకొల్లలు .ఇన్ని ఫెయిల్యూర్స్ వల్ల ఏమి చెప్పుకోవాలో, ఏ విధంగా గౌరవ ప్రదంగా ప్రభుత్వ పరువు నిలుపుకోవాలో,అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
స్థానికంగా అంబేద్కర్ గారి పేరు ఆ జిల్లాకు పెట్టడం అక్కడి ప్రజలకు కూడా ఇష్టం లేక కాదు వుంది.
కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో.. గతంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించి బెదిరించిన ఉద్యోగస్తులు, విజయవాడలో ఒకరోజు సమ్మెకు పిలుపిస్థే.. ప్రభుత్వం ,పోలీసులు కూడా ఏమి చేయలేక ఏ విధంగా విజయవంతమయిందో మనం మరచిపోలేదు . అమలాపురం లో కూడా ప్రభుత్వం మీద వుండే వ్యతిరేకతతో ప్రజలు బయటకు వచ్చి ఈ విధమైన నిరసన తెలియజేశారు అనిపిస్తుంది.
– కరణం భాస్కర్
బిజెపి ,
7386128877 .