– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?
రాష్ట్రానికి ఒక వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారు.ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థల ను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరు. అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం. మీ ప్రభుత్వాన్ని
రద్దు చేసే దమ్ముందా.. మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు BJP పాలిత రాష్ట్రాలలో అమలు అవుతున్నాయా?రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి KCR కుటుంబాన్ని కుటుంబ పాలన అని పేర్కొనడం అవివేకం.తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో KCR కుటుంబం పాల్గొన్నది.
ఇష్టానుసారంగా మాట్లాడుతున్న BJP నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత అధినాయకత్వానిదే. తెలంగాణ రాష్ట్రం ఎంతో సురక్షితంగా ఉన్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రులు ఎందుకు స్వాగతం పలికేందుకు రావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ. నూతనంగా 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లు . ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న చరిత్ర మీది.