Suryaa.co.in

Telangana

మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం

– సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం అభూత కల్పన. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి KCR ఆలోచన. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం.బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.పవిత్ర పుణ్యక్షేత్రం మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాదిమంది తరలివస్తారు. వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా బోనాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తాం.

LEAVE A RESPONSE