Suryaa.co.in

Andhra Pradesh

రుషికొండ తవ్వకాలపై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రుషికొండ తవ్వకాలపై స్టే ఇచ్చిన ఎన్జీటి.
ఎన్జీటి స్టే పై సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.
న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ.
ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.
ఎన్జీటి నియమించిన మొదటి కమిటీ నివేదికలో పర్యావరణ ఉల్లంఘనలు లేవని స్పష్టం చేసిందన్న సింఘ్వీ.
అయినా ఎన్జీటి స్టే విధించి మరో కమిటీని నియమించడం సబబు కాదు.
ఏపీ ప్రభుత్వం వాదన వినకుండా స్టే ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దం.
సిఆర్ జెడ్‌-2 పరిధిలోకి రుషికొండ ప్రాజెక్టు వస్తుందని ఎన్జీటి మొదటి కమిటీ చెప్పింది.
ఇప్పడు సిఆర్ జెడ్ -3 నిబంధన అమలు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటి కోరుతుందన్న సింఘ్వీ.
తుది తీర్పుకు కట్టుబడి ఉంటారా? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం.
ఆ మేరకు హామీ పత్రం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న ఏపీ ప్రభుత్వం.
ఏపీ హైకోర్టు గతంలో రెండు సార్లు స్టే ఇవ్వడానికి నిరాకరించిన అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన సీనియర్ కౌన్సిల్ సింఘ్వీ.
ప్రతివాది ఎంపీ రఘురామ తరపు వాదనలను వినడానికి రేపటి వరకూ సమయం ఇచ్చిన ధర్మాసనం
తదుపరి విచారణ రేపటికి వాయిదా.

LEAVE A RESPONSE