Suryaa.co.in

Telangana

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సివిల్స్-2021 టాపర్ అఖిల్

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించిన అఖిల్. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉంది.అని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్ కు ముందుగా అభినందనలు.తెలుపుతూ పేదరికం, అపజయాలు లెక్క చేయకుండా నిరంతర కృషితో లక్ష్యాన్ని చేరుకోవడం హర్షణీయం. మీ విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. అనంతరం వారిని సన్మానించడం జరిగింది.

LEAVE A RESPONSE