బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణం

– కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికే
– కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు.. మేము మాత్రం చేయొద్దా?
– రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డ ర్
– మంత్రి పువ్వాడ అజయ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్

బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పువ్వాడ – వినోద్ ఏమన్నారంటే…

వారు మాట్లాడుతుంది పూర్తి అవగాహనా రాహిత్యంతోనే అని అర్థమవుతుంది. రాత్రి విమానంలో తిరిగితే ఎన్ని రాష్ట్రాల్లో కరెంట్ ఉం దో , లేదో సంజయ్ కి తెలుస్తుంది. జీతాలకు- అప్పులకు సంబంధం లేదు. రాష్ట్ర ఆదాయంతో జీతాలు, పథకాలు నడుస్తాయి. కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికే.

రాష్ట్ర ఆదాయాన్ని బట్టి అప్పులు వస్తాయి… కానీ కేంద్రం కావాలనే అడ్డు పడుతోంది. 8 ఏళ్లలో కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు.. మేము మాత్రం చేయొద్దా కేంద్రం వంద లక్షల కోట్లు వేటికోసం చేశారో చెప్పగలరా? అప్పుల గురించి న్యాయపరమైన నిబంధనలు అన్ని పాటిస్తాం.

ajay1రాష్ట్రం ఏర్పాటు నాటికి 7వేలు ఉన్న పరిస్థితి నుంచి 24వేల మెగావాట్ల ఉత్పత్తికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ . నేలమీద తిరిగితే విద్యుత్ కనిపించకపోతే.. బండి సంజయ్ విమానంలో తిరగాలి.. తెలంగాణకు ఇతర రాష్ట్రాలకు తేడా తెలుస్తుంది కరెంట్ ఉందా..? లేదా..? అనేది. కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతుంటే.. కేంద్రం అమ్ముతోంది. BHEL సంస్థ నుంచి సామాగ్రి కొన్నాం కాబట్టే… ఇవ్వాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఇండియా బుల్స్ అనేది RBI కాదు.. ఒక బ్రోకరేజ్ సంస్థ. సాధ్యం కాదు అనుకున్న రాష్ట్రాన్ని తెచ్చిన మేము- అప్పులు తేలేమా?

బండి సంజయ్ నిన్న భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మాటలు విన్నాక బాధేసింది.
భద్రాద్రికి కేంద్ర ప్రభుత్వం BHEL సంస్థ ఇచ్చిన యంత్రాలే కదా!. బండి సంజయ్ తనపై తానే ఆరోపణలు చేసుకున్నారు.. తిరిగి టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. BHEL ఇచ్చిన సామగ్రి తుప్పుపట్టిన యంత్రాలా? సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్, మోడీకి పైసలు ఇచ్చినట్లు ఉన్నాయి. కరెంట్ కొనుగోళ్ళకు 20రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయని అప్పుడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసింది. ఈ నెలలో కూడా 6 రూపాయల నుంచి 12 రూపాయలు పెట్టుకోవచ్చు అని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. అంబానీ, అదాని వచ్చినా కేసీఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు సీఎం కేసీఆర్ .

NTPC కి 7 రూపాయలు ఇచ్చి కరెంట్ కొంటున్నాం.. ఇప్పుడు కేసీఆర్ NTPC కి పైసలు ఇస్తుండా? బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణంగా ఉన్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డర్. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వం ఈక్విటీ ఉంది. బండి సంజయ్ ఆరోపణలు చేయడం మానేయండి.. లేదంటే నిజాలు చెప్పండి. సంజయ్ తన ఆరోపణలు విరమించుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేది కేసీఆర్ లేకుంటే..!

దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు తీసుకుంటాయి..కానీ తీసుకున్న అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ చెప్పింది. FRBM నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వమే!. టీఆరెస్ ప్రభుత్వం అప్పులు ప్రజలు- రైతుల కోసమే!. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

Leave a Reply