– వేమూరు పరిధిలో మట్టి తవ్వకాలపై మైనింగ్ డీడీకి వినతిపత్రం
గుంటూరు మైనింగ్ డీడీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆందోళనకు దిగారు. వేమూరు పరిధిలో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, అధికారులు నిరంకుశ వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. మట్టి తవ్వకాలపై మైనింగ్ డీడీకి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆనంద్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ”వేమూరు నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. మంత్రి మేరుగ నాగార్జున నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ కమ్మక్కవుతున్నారు. అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకోవడం లేదు. కోర్టు తీర్పులను సైతం పట్టించుకోకుండా అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు” అని ఆనంద్‌బాబు పేర్కొన్నారు.