-ఈ మూడు సంవత్సరాల్లో వ్యవసాయశాఖకు ఒక లక్షా పది వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపిస్తే వంగి దండం పెడతాం
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఈ మూడు సంవత్సరాల్లో వ్యవసాయశాఖకు ఒక లక్షా పది వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. నిరూపిస్తే వంగి దండం పెడతాం. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 9 మంది సభ్యులున్నారు. సీనియర్ టీడీపీ లీడర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రైతు రాష్ట్ర అధ్యక్షుడు కూడా సభ్యుడే. మూడేళ్లలో రైతుల పై వైసీపీ ప్రభుత్వం అనేకవిధాల దాడికి పాల్పడింది. అనేక దుర్మార్గాలు చేసింది. బడ్జెట్ మంజూరు కూడా కాగితాలకే పరిమితం చేసింది. దానికి విలువ లేకుండా చేసింది. వ్యవసాయశాఖని నిర్వీర్యం చేసింది. వ్యవసాయ శాఖ లిటరల్ గా మూతపడింది. ఒక్క రైతు భరోసా కింద రైతు కుటుంబానికి రూ.7,500 మాత్రమే ఇచ్చింది. మొత్తంగా11 వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మోటార్లకు మీటర్లు-రైతు మెడకు ఉరితాళ్లు అనే నినాదంతో ప్రజల ముందుకెళ్తాం. ఇంకా మద్దతు ధరలో రైతులకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రధానంగా తీసుకెళ్తాం. పంట నష్ట పరిహారంలో జరిగిన అన్యాయం, పంట కాలువలను మరమ్మత్తులు చేయకపోవడం, క్రాప్ హాలిడే తీసుకరావడం, డ్రిప్ ఇరిగేషన్ ను నిర్వీర్యం చేయడం లాంటివాటిని రద్దు చేయడాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఈ పనుల్నీ దేశ వ్యాప్తంగా జరుగుతుంటే ఇక్కడ కంప్లీట్ గా స్టాప్ చేశారు.
టీడీపీ హయాంలో యాంత్రీకరణ మెకనైజేషన్ ని ఒక్క స్మామ్ లో సంవత్సరానికి 4 వందల కోట్లు ఖర్చు పెట్టాం. స్టేట్ డెవలప్ మెంట్ ఫండ్ లో 2 వందల కోట్ల రైతు రథాలిచ్చాము. యంత్ర పరికరాలకు మొత్తం 600కోట్లు లాస్ట్ టూ ఇయ్యర్స్ లో ఇచ్చాం. మొదటంతా 3 వందల కోట్లు ఇచ్చాం. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మీటర్లు పెట్టనుంది. 5 ఎకరాలకు ఒక మీటర్ ఇలా దశలవారీగా ఇన్ స్ర్టక్షన్స్ చేయనుంది. అమ్మ ఒడికి పెట్టినట్లుగా ఇందుకు కూడా కొన్ని నిబంధనలు పెట్టనుంది. అర్దరూపాయి, రూపాయి ఇలా పెంచుకుంటూ పోతారు. వీటన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. టీడీపీ హయాంలో 2017-18లో 12 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. 2018-19లో 11 వేల ట్రాక్టర్లు ఇచ్చాం. 23 వేల రైతు రథాలు రైతులకు అందించాం. ఈ పథకాలను కంప్లీట్ గా పడుకోబెట్టాడు. భూసార పరీక్షలు ఆపేశారు. ఈ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం. ఒక లక్షా పది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కేటాయించినట్లు నిరూపిస్తే వంగి దండం పెడతాం. దమ్ముంటే నిరూపించాలి. ధాన్యం కొనుగోలుకు 43 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపించాలి. ఇందులో బ్రోకర్లకు ఎంత పోయిందో వివరించాలి. పండించిన పంట కు మద్దతు ధర రాక ఎన్ని వేల కోట్లు రైతులు నష్టపోయారు? పండించిన పంట అమ్మబోతే 30 శాతం బ్రోకర్లకు పోతుంది.
ఉచిత విద్యుత్ కు ఇచ్చింది 13 వేల కోట్లు అనడం అబద్ధం. వ్యవసాయ రంగానికి రైతు బడ్జెట్ లో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో తెలపాలి. రైతు భరోసా కింద పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎకరాకు పది వేలు ఇస్తుంటే ఏపీ లో కుటుంబానికి రూ.7, 500 ఇస్తున్నారు, ఆర్ కెవివైలు, పీకేవీవైలు లను రద్దు చేశారు. వ్యవసాయ శాఖ మూతపడింది. నెల్లూరు సోమశిల, కండలేరులో 90 టీఎంసీల నీరు ఉంది. రెండో పంట వేసేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఒనమాలు రాని వ్యక్తి చంద్రబాబునాయుడును విమర్శించడమా? రైతుల కోసం తపనపడాలి. దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో తెలిపితే మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం. నాలుగేళ్ల తరువాత 3,400 ట్రాక్టర్లు ఇస్తున్నామని వైసీపీవారు పేర్కొనడం అర్థరహితం.5 జోన్లుగా విభజించాం. జులై 1వ తేది కాకినాడ జగ్గంపేట దగ్గర, జులై 7వ తేదిన విజయనగరం పార్లమెంట్ గజపతినగరం దగ్గర, 13వ తేదిన థర్డ్ జోన్ విజయవాడ పార్లమెంట్ లో ఇలా స్థలాలను గుర్తించాం. 5 జోన్లలో 5 బహిరంగసభలు పెట్టి ప్రజలకు అవగాహన కలిగిస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.