టీడీపీ & లోకేష్ ఫై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్…..

Spread the love

వాస్తవాలని వక్రీకరించడం తెలుగుదేశం పార్టీ కి నారా లోకేష్ కి అలవాటైపోయింది.ఎన్నికలో ఓడిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్ లోకేష్ కు గుర్తుకు వచ్చిందా..?ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అర్థం లేకుండా తెలుగుదేశం పార్టీ, లోకేష్ ప్రవర్తిస్తున్నారు.అన్నా క్యాంటీన్ కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు అనే ప్రచారం అబద్ధం.తెలుగుదేశం పార్టీ వారు పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని చలివేంద్రం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అధికారులు అందుకు అభ్యంతరం చెప్పలేదు. కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన 100 చలివేంద్రలతోపాటు తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా అధికారులు ఆహ్వానించారు.

రోడ్డు మీద ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆసరాగా చేసుకుని చలివేంద్రాన్ని తొలగించి పక్క బిల్డింగ్ కట్టాలంటే ప్రణాళికతో (లేదా) అన్నా క్యాంటీన్ పేరుతో ఆ ప్రదేశాన్ని మార్చటానికి కబ్జా ప్రయత్నం చేశారు.రోడ్డు ఆక్రమణ చేస్తున్నారనే నేపథ్యంలోనే కార్పొరేషన్ అధికారులు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న ఆక్రమణను అడ్డుకున్నారు.1968లో 30 అడుగుల రోడ్డు మాత్రమే ఉండే మంగళగిరి రోడ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 270 అడుగుల వెడల్పు తారు రోడ్డు వేశాం.రోడ్లను ఆక్రమించి అన్న క్యాంటీన్ వంటి నిర్మాణాలు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు కార్పొరేషన్ అధికారులు అంటున్నారు.

అన్నా క్యాంటీన్ నిజంగా ప్రజలకు అందజేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉండి ఎందుకు మంగళగిరిలో ఏర్పాటు చేయాలేకపోయారు..?మంత్రి పదవులు ,ప్రభుత్వం దిగి పోతున్న ఆరు నెలలు సమయంలో హడావుడిగా అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు.గతంలో నేను కూడా రాజన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు మధ్యాహ్నం భోజనం అందజేశాం.మొబైల్ వాహనం ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజల అన్నదానం చేయండి.లేదా గౌతమ్ బుద్ధ రోడ్ లో షాపు , ఖాళీ ప్రదేశాలు అద్దెకు తీసుకోని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకోండి అందుకు ఎవరు అభ్యంతరం తెలిపారు.ఎవరు వాడిని పదజాలంతో ముఖ్యమంత్రిపై మాట్లాడం తీవ్రంగా ఖండిస్తున్నాం.

Leave a Reply