Suryaa.co.in

Andhra Pradesh

అధికారులు గుర్తు పెట్టుకోవాలి : నక్కా ఆనంద బాబు

– మంగళగిరిలో అన్న క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి, నక్కా అనందబాబు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను కూల్చటం దుర్మార్గం అన్నారు. పేదలకు 2 రూపాయలకే అన్నం పెడుతుంటే అడ్డుకుంటున్న ప్రభుత్వం దిక్కు మాలిన ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ప్రభుత్వంలో కొనసాగించిన అన్న క్యాంటీన్ లను జగన్ ప్రభుత్వం తొలగించింది. టిడిపి ఆద్వర్యంలో అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. పోలీసులు, కార్పొరేషన్ అధికారులు ఆర్కే అండతో దుర్మార్గపు చర్యలకు పాల్నాడుతున్నారు. తప్పుడు విధానాలను అనుసరించే అధికారులకు రాబోయే కాలం సమాధానం చెబుతాం. అధికారులు గుర్తుపెట్టుకోవాలి. నక్కా అనందబాబు ప్రభుత్వ యంత్రాంగం తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.

రాజన్న క్యాంటీన్ టిడిపి ప్రభుత్వం అడ్డుకుందా?
అన్న క్యాంటీన్ల ద్వార పేదలకు భోజనం పెడుతుంటే అడ్డుకోవటం ప్రజలు గమనిస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే చర్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్కే రాజన్న క్యాంటీన్లు నిర్వహించినప్పుడు టిడిపి ప్రభుత్వం అడ్డుకుందా అని ప్రశ్నించారు.

పేదలకు అన్నం పెడితే కేసులు పెడతారా : ఎంఎస్ రాజు
టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం ఎస్ రాజు మాట్లాడుతూ పేదలకు అన్నం పేడుతుంటే పోలీస్ బలగాలతో అడ్డుకునే చర్యలు బాధకరం అన్నారు. ఎంటిఎంసి అడిషనల్ కమిషనర్ హేమమాలినీ రెడ్డి అనైతిక చర్యలకు పాల్పాడుతున్నారని ఎం ఎస్ రాజు ఆరోపించారు.

కమల్ హాసన్ వేషాలు అందరికి తెలుసు : పిల్లి మాణిక్యరావు
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే కమల్ హాసన్ వేషాలు రాష్ట్ర ప్రజలందరికి తెలసు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కొనసాగిస్తాం. ఎన్ని అడ్డంకులు పెట్టిన అగేది లేదన్నారు. ఎన్నికలకు ముందు ఆర్కే 10 రూపాయలకు 5 రకాల కూరగాయలు, 4 రూపాయలకు భోజనం పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ఎందుకు మంగళగిరి ప్రజలను మోసగించావో సమాధానం చెప్పాలన్నారు.

LEAVE A RESPONSE