Suryaa.co.in

Andhra Pradesh

రైతుల శ్రేయస్సు కోసమే టీడీపీ రైతు పోరుబాట

– రైతులందరూ పౌరుషంగా కదంతొక్కి ముందుకు రండి
– రైతు సమస్యలపై మనమందరం కలిసి పోరాడదాం
– రైతన్న ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చివరకు రైతుల గొంతే కోసింది
– ఏపీలో రైతులకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయం, దగాలపై జూన్ 20 నుంచి రైతు పోరు బాట కార్యక్రమాన్ని చేపడుతున్నాం
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంచాయతీ పరిధిలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.

సోమిరెడ్డి ఏమన్నారంటే..
రైతన్నపై వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష సాధింపు . జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు పోరుబాటకు రైతులు స్వచ్ఛందంగాsomireddy1 తరలిరండి.రైతులు వారి హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు రండి.వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతన్న పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దురదృష్టకరం . టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.

టీడీపీ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తాను రెండేళ్లలో 23 వేలకు పైగా రైతు రథాలను పంపిణీ చేస్తే నేడు వైసీపీ నాలుగేళ్ల పాలనలో 3800 రైతు రథాలను మాత్రమే పంపిణీ చేసింది.రైతు సంక్షేమం కోసం టీడీపీ పాటుపడితే రైతుల గొంతు కోసింది మాత్రం వైసీపీ ప్రభుత్వమే.

వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కన్నబాబుకు వ్యవసాయం అంటేనే తెలియదు.. ఇప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతుల మధ్యకు వెళ్ళే దమ్ము లేదు.రైతుల కష్టాలను గాలికొదిలేసి, వారి గోడును పట్టించుకోలేని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాటకు వస్తే చంద్రబాబును విమర్శిస్తాడు.చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి, అర్హత కాకానికి లేదు .

వైసీపీ మూడేళ్ల పాలనలో రైతన్న కష్టాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వడ్ల దళారులతో కలిసి అందినకాడికి అందినంతగా దోచుకున్నారు.ఒక నెల్లూరు జిల్లాలోనే వైసీపీ మూడేళ్ల పాలనలో రైతులు రూ.మూడు వేల కోట్లకు పైగా నష్టపోయారు. రైతులను మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో అన్ని విధాలుగా మోసం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడు. రైతులను నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారు.

LEAVE A RESPONSE