అఖిల్ తాజా చిత్రంగా ‘ఏజెంట్’ రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు మొదలై చాలా కాలమైంది.
ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం లేదు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొంత సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే దసరాకి గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిళ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.