( సందీప్)
2019 లో టీడీపీని ఓడించింది జగన్ కాదు. ప్రశాంత్ కిషోర్ కుట్రలు,మోడీ సహకారం మాత్రమే. వారి కుట్రలకు బలై పోయామని తెలుసుకోడానికి మాడు సంవత్సరాలు పట్టింది.తిరిగి అవే కుట్రలు పన్నడానికి మళ్ళీ “ఐ పాక్ “అనే కొత్త టీమ్ ని రంగంలోకి దించాడు జగన్ రెడ్డి.
ఆ టీమ్ సభ్యులు జన సమూహంలో కలిసిపోయి అవాస్తవాలను వాస్తవంగానమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. విష ప్రచారాలను విస్తృతంగా వ్యాపింప చేస్తారు. నమ్మితే మన గతి అధోగతే.
ఒక్క ఛాన్స్ ఇచ్చి అమరావతిని నాశనం చేసుకున్నాము.
తిరుమల తిరుపతి ని అపవిత్రం చేసుకున్నాము.
యూనివర్సిటీ ల స్థాయిలను దిగజార్చుకున్నాము.
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవలసిన యువత 15 వేలకు సచివాలయ సిబ్బందిగానూ, 5 వేల రూపాయలకు వాలెంటరీ ఉద్యోగాలు చెయ్యడానికి దిగజార్చ బడ్డాము.
సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి మనకేదో లాభం చేకూర్చినట్లు ఫోజులు కొట్టి, నాశిరకం మధ్యం ధరలు రెండు వందల శాతం పెంచి, గంజాయి వంటి మత్తు పదార్ధాలకు యువతను బానిసలుగా చేశాడు.
ప్రతి నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు పెంచి మనలో బీదరిక భావనలు నింపి ఓటుకు ఐదువేలు విసిరేసి అయినా గెలవాలని అనుకుంటున్నాడు.
భూముల సర్వేల పేరుతో, రైతులు వ్యవసాయం చేసుకుంటున్న డీ కె టి భూములను స్వాధీనం చేసుకుని అమ్ముకోవడము, తాకట్టు పెట్టడం చేశాడు.
అనవసర పన్నులు వేసి మానసికంగా ఆందోళనలు కలిగించాడు.
చీకటి జీ వో లు విడుదల చేసి ప్రజల సంపాదనలను అడ్డంగా దోచేశాడు.
డాక్టర్లు,టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రభుత్వొద్యోగులు ,వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చినపుడంతా నిర్ధాక్షిణ్యంగా దౌర్జన్య పూరితంగా అణిచి వేశాడు. నియంతృత్వ పాలన అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు.
దేవాలయాల మీద దాడులు, ధ్వంసాలు జరుగుతుంటే ఒక్కడిని కూడా అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవు.
మహిళల మీద, చిన్నపిల్లలమీద, కాలేజీ విద్యార్థిను లమీద సామూహిక అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వంలోని మహిళా మంత్రులు భాద్యతా రహితంగా మాట్లాడిన మాటలు విన్నాము.కానీ ఖండించే ధైర్యం లేదు.
ఉచితంగా వస్తున్నాయని ఒక వర్గం ఓటర్లు అర్హత లేకున్నా ప్రభుత్వ ఫలాలు అందుకుంటూ, రాజకీయ వ్యవస్థను దోచుకోడానికి వంత పాడుతున్నారు.
రోడ్లు లేవు, పారిశుద్ధం లేదు,వైద్య సదుపాయం నామ మాత్రం,విద్య అస్తవ్యస్తo,రక్షణ అసలే లేదు.
సామాన్యుడికి కావలసినది ఏదీ లేకుండా చేసి కొంత డబ్బు వాడి మొఖాన ఉచితంగా వేసి వాడి సర్వ హక్కులనూ దోచుకుంటుంటే, తాము ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్ధం చేసుకోలేని స్థితిలోకి, ఆలోచించుకునే సమయం లేకుండా సొంత మీడియా ద్వారా ఇతరుల గురించి చెడుగానూ, తమ గురించి ఉన్నతం గానూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను కుల, మత, ప్రాంత విద్వేషకులుగా మార్చి వేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి గద్దె నెక్కితే రాష్ట్రం మొత్తం మానసిక రోగులుగా మారిపోతుంది. ఏ మందులూ పనిచెయ్యవు…