ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ హల్ చల్ చేశారు. వరంగల్ వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె మండిపడ్డారు.ఏ కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు. వెంటనే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వరంగల్ నుంచి నేరుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కొండా సురేఖ స్టేషన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది.
దానికి పోలీసులు అంగీకరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. గేట్లను తోచుకుంటూ లోపలికి వెళ్లింది. డోర్ తీయాలని కోరినా పోలీసులు తీయకపోవడంతో తన దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉందని చెయ్యి కోసుకుంటా అని బెదిరించింది. ఎటువంటి కారణం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులపై మండిపడింది. కాగా, ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు ఫోన్ లాక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.
కొండా సురేఖ మాస్🔥
ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ.
స్టేషన్ లోకి అనుమతించని పోలీసులు. గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళిన కొండా సురేఖ.
ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ ముందు కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల ఆందోళన#kondasurekha @kondasurekha3 @INCTelangana pic.twitter.com/auEYWm82OH
— Congress for Telangana (@Congress4TS) June 18, 2022