ఈ రోజు రాహుల్ గాంధీ పుట్టిన రోజు(నాకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ పెట్టిన పోష్టులు చూసే వరకూ గుర్తు రాలేదు). నాకు తెలిసి ఇంత నిస్వార్థ పరుడూ, అంత దురదృష్టవంతుడూ మరొకడు లేడు.షూటింగ్, మార్షల్ ఆర్ట్స్, ఈత మొదలగు రంగాల్లో జాతీయ స్థాయిలో రాణించి ఎంత లావు గలిగిన వాడినైనా రెండే రెండు పిడి గుద్దులతో నేలగూల్చేయగలిగిన శారీరక దారుఢ్యత సాధించిన మనిషిని ‘పప్పు’ అంటూ దశాబ్ద కాలంగా ఆడుకుంటోందీ నికృష్ట సమాజం.చదువులో ఎంఫిల్ డిస్టింక్షన్ లో పూర్తి చేసి విషయాలన్నిటిపైనా సమగ్ర ఆకళింపు కలిగి దేశ విదేశాల్లో అత్యున్నత వేదికల మీద కొమ్ములు తిరిగిన మేధావులడిగిన వేసిన తికమక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎలాంటి టెలీప్రాంప్టర్ తోనూ పనిలేకుండా ఆలవోకగా చెప్పగలిగిన వాణ్ణి అసమర్ధుడిగా చిత్రీకరించిందీ దుర్మార్గపు లోకం.
నడి సముద్రంలో ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి రక్షణ జాకెట్లు వేసుకోకుండా, పబ్లిసిటీ కెమెరాలేవీ లేనప్పుడు దూకేసి ఈత కొట్టిన గజ ఈతగాణ్ణి ధైర్యం లేనివాడని ఈసడించిందీ పాడు లోకం.
కోవిడ్ మహమ్మారి మీద పడబోతోంది అంటూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసేయండని ముందస్తు హెచ్చరిక చేసిన వాణ్ణి లోకం తెలియని వాడని వెక్కిరించి అదే సమయంలో లక్షల మందితో విదేశీ నాయకులతో స్టేడియంలో మీటింగు పెట్టిన వాళ్లను లోకనాయకుడిగా కీర్తించిందీ లోకం. ఫలితం గంగానదిలో శవాల గుట్టలు, గంగ ఒడ్డున చితుల మంటలు.నీవిలువ మాజనానికి తెలియదు. నీ హృదయంలో నిండిన క్షమ,ప్రేమ, ఆర్తి, ఆర్ద్రత తెలుసుకోగలిగిన తీరిక మాకు లేదు. కాకపోతే ఎవడో చెప్పిన వెధవ మాటలు వినేసి అవి నిజమో కాదో నిర్ధారించుకోకుండా నీమీద రాళ్ళేసేస్తాం. నీ తండ్రి తాతలు చేసిన త్యాగాలు కూడా మాకు గుర్తుండవు. మేమంతా ఇప్పుడు అదేదో లోకంలో ఉన్నాంలే. ఏదో మొక్కుబడిగా నీకు శుభం జరగాలని, మీ నాన్న, నాయనమ్మల్లాగ కాకుండ నువు దీర్ఘాయుష్మంతుడవు కావాలని మాత్రం కోరతాను.
– ఎన్.కృష్ణకుమార్‌గౌడ్