Suryaa.co.in

Andhra Pradesh

అబద్ధాలు చెబుతారు… అడిగితే ఏడుస్తారు?

ఓర్చుకోలేక అసత్య ప్రచారాలు. ప్రభుత్వంపై నిందలు
కంపెనీలు రాకుండా తరిమేయాలని నిరంతరం కుట్రలు
రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశం
అందుకే చంద్రబాబు, లోకేష్‌ అసంబద్ధ విమర్శలు
ఇవాళ కూడా నారా లోకేష్‌ అర్ధం లేని ట్వీట్లు
ఇవాళ తిరుపతి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు
రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులు. 20 వేల ఉద్యోగాలు
పలు కంపెనీలకు ప్రారంభోత్సవం. కొన్నింటికి భూమి పూజ
ఇంకా పలు పరిశ్రమలతో ప్రభుత్వం ఎంఓయూ
దీంతో నారా లోకేష్‌ అసత్య ప్రచారం. అబద్ధ ట్వీట్లు
ప్రెస్‌మీట్‌లో పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇంకా ఏమన్నారంటే..:

తిరుపతి జిల్లాలో పారిశ్రామిక పురోగతి:

తిరుపతి జిల్లాలో సీఎం «« వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీల ప్రారంభం. మరి కొన్నింటికి భూమి పూజ చేయడం జరిగింది. ఇనగలూరులో హిల్‌ టాప్‌ ఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అపాచీ)కు భూమి పూజ చేయడం జరిగింది. దాదాపు 298 ఎకరాల్లో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీ. రూ.8 వేల కోట్ల పెట్టుబడి. ఆ 10 వేల మందిలో దాదాపు 80 «శాతం స్థానిక మహిళలకు అవకాశాలు రానున్నాయి.

రేణిగుంట సమీపంలోనే ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో టీసీఎల్‌ కంపెనీ దాదాపు రూ.1230 కోట్ల పెట్టుబడి. 2200కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఫాక్స్‌లింక్స్‌ కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడి. ఇక్కడ కూడా 2200 మందికి ఉద్యోగ అవకాశాలు. సన్నీ ఒపోటెక్‌. దాదాపు 1200 మందికి ఉద్యోగావకాశాలు. వీటన్నింటినీ సీఎం ప్రారంభించారు.

వీటన్నింటితో పాటు, డిక్సన్‌ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీకి శంకుస్థాపన, స్మార్ట్‌ టీవీ సంస్థతో ఓంఓయూ. టెక్‌బౌల్స్‌ సంస్థ. దాదాపు 800 మందికి ఉద్యోగావకాశాలు. ఒంగోలులో రూ.800 కోట్ల పెట్టుబడి. దాన్ని వర్చువల్‌గా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడి. 20 వేల మందికి ఉద్యోగవకాశాలు. ఇవాళ తిరుపతి జిల్లాలో అభివృద్ధి.

అది ఒక రికార్డు:

రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక, ఇక్కడ ఉన్న అవకాశాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్‌ చేసి, యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలి. అందుకు ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి అన్న దానిపై ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. కోవిడ్‌ వల్ల దాదాపు రెండేళ్లు నష్టం జరిగింది. అయినా సీఎం ఎక్కడా, ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. సంక్షేమ రంగంలో రాష్ట్రాన్ని పరుగెత్తించారు. రెండేళ్లలోనే హామీల్లో 95 శాతం నెరవేర్చారు. లక్ష కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ఇవ్వడం అనేది దేశంలోనే ఒక రికార్డు.

ఎన్నో వనరులు. పూర్తి సహకారం:

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్రంలో విశాలమైన 974 కి.మీ సముద్ర తీరం. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హర్బర్ల వల్ల పారిశ్రామికంగా మరింత పురోగతి రానుంది.

గతనెలలో మా దావోస్‌ పర్యటనలో కూడా పలు సంస్థలతో చర్చించడం జరిగింది. ఇక్కడ ఏ కంపెనీ పెట్టినా దానికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటివన్నీ ప్రభుత్వం సమకూరుస్తుంది.

ఇవాళ భూమి పూజ చేసిన అపాచీ కంపెనీ తైవాన్‌కు చెందినది. గతంలో ఆ సంస్థ ఇక్కడ యూనిట్‌ ఏర్పాటు చేయగా, అక్కడ 15 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇక టీసీఎల్‌ కంపెనీ చైనాకు చెందింది. ఆ విధంగా అభివృద్ధి. సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పని చేస్తోంది.

ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీ విశాఖకు వస్తోంది. రెండు నెలల్లో కార్యకలాపాలు మొదలు పెట్టనుంది.

ఒప్పందాలు కార్యరూపం:

ఇక్కడికి ఏ కంపెనీ వచ్చినా, వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తాం. ఇదే విషయాన్ని సీఎంగారు చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన చిత్తశుద్థితో పని చేస్తున్నారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యారూపం దాలుస్తున్నాయి. ఎక్కడా ఏదీ ఆగడం లేదు.

ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్నారు:

ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తుంటే, రాష్ట్ర ఇమేజ్‌ దెబ్బ తీయాలని, ఏ విధంగా వాటిని చెడగొట్టాలని ప్రతిపక్షం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇక ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు ఇద్దరూ గతి తప్పి మాట్లాడుతున్నారు.
తమ హయాంలోనే టీసీఎల్‌ కంపెనీ వచ్చిందని, దానికి మేము ఇప్పుడు పేరు మార్చామని గతంలో ఐటీ మంత్రిగా పని చేసిన ఆయన (లోకేష్‌) చెబుతున్నారు. మీరు శంకుస్థాపన చేసిన స్థలంలో నిజంగా టీసీఎల్‌ కంపెనీ పెట్టి ఉంటే, మేము ఒప్పుకుంటాం. అసలు మీరు ఒప్పందం చేసుకున్నది ఎప్పుడు? పార పట్టి ఫోటోలు దిగిందెక్కడ? శంకుస్థాపన చేసిందెక్కడ? అవి చెప్పండి.

టీసీఎల్‌ మా హయాంలోనే:

నిజానికి 2019 ఆగస్టులో టీసీఎల్‌ సంస్థకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాకే ఆ కంపెనీకి భూమి ఇచ్చాం. వారు కంపెనీ పెట్టారు. ఇవాళ ప్రారంభించడం జరిగింది.
కానీ, చంద్రబాబు ఎప్పుడూ అన్నీ తానే చేశాననే భ్రాంతిలో ఉంటాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్, శంషాబాద్‌ విమానాశ్రయం అన్నీ తానే కట్టానంటాడు. ఇప్పుడు చినబాబు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మేము ఏది చేసినా, అన్నీ తామే చేశామంటున్నాడు.

ఆనాడు మీరేం సాధించారు?:

అసలు మీరు ఆనాడు ఏం చేశారు? కేవలం సూటు, బూటు ఫోటోలు తప్ప ఏం సాధించారు?. రూ.150 కోట్లు ఖర్చు పెట్టి, నాలుగు పార్టనర్‌షిప్‌ సమ్మిట్లు పెట్టి, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలని ఏ స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. కేవలం ఫోటోలు ఎంఓయూలు.. అంతా ఆర్భాట ప్రచారం.
ఆరోజు ఉన్న ప్రభుత్వంపై మాకే అసోసియేట్స్‌ అనే సంస్థ ఏ ప్రకటన చేసిందో మనం చూశాం కదా. అలాగే చాలా సంస్థలు అప్పటి ప్రభుత్వంపై ఏం మాట్లాడాయన్నది చూశాం కదా?.

నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు అమరావతిలో గ్రాఫిక్స్‌ చూపి, అద్భుతాలు చేసినట్లు చూపించాడు. రోజూ పేపర్లలో గ్రాఫిక్స్‌ చూపడం. ప్రచారం చేసుకోవడం. అంతేతప్ప, మరొకటి లేదు.

ఒక్కటైనా చెప్పుకోగలవా?:

మొన్న అనకాపల్లి జిల్లాలో మాట్లాడిన చంద్రబాబు ఏం అన్నారు? తాను మంచి చేద్దామనుకున్నానని అన్నాడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, తనకు తాను చెప్పుకోవడానికి కనీసం ఒక్క పథకమైనా ఉందా?.
అదే సీఎం వైయస్‌ జగన్‌ ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తున్నారు. అంకెల గారడీ కాకుండా, వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం అంత స్పష్టంగా ఉంది. అసలు ఇంత వాస్తవంగా ఇన్ని జరుగుతుంటే, లోకేష్‌ అసలు ఆ ట్వీట్‌ ఎలా పెట్టావు?

నీవసలు ఎన్టీఆర్‌ వారసుడివా?:

లోకేష్‌ నీ తండ్రి చంద్రబాబునాయుడు. అయితే నీవు ఎన్టీఆర్‌ వారసుడివని ఎలా చెబుతావు? మీ నాన్న మీ తాతను వెన్నుపోటు పొడిచి సీఎం పదవి పొందాడు. చివరకు ఆయన చావుకు కారణమయ్యాడు. మరి నీవు ఎన్టీరామారావు వారసుడివని ఎలా చెబుతావు? ఆయన చావుకు కారణమైన నీ తండ్రిని పక్కన పెట్టుకుని ఆ మాట ఎలా చెబుతావు? అసలు నీవు ఖర్జూరనాయుడికి వారసుడివి. ఆ మాట ఎప్పుడైనా చెప్పావా? మేము ఏమన్నా అంటే, ఏడుస్తారు.

అథికార దాహం తప్ప..:

ఇవాళ తిరుపతి జిల్లాలో అంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే, అర్ధం లేని విమర్శలు. కనీసం సీఎం అన్న గౌరవం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎంతసేపూ అధికార దాహం తప్ప. అంతేకానీ రాష్ట్రానికి మేలు జరగాలన్నది మీ అభిమతం కాదు. మీరు ఇలాగే మాట్లాడితే, మీ కర్మ. రేపు ప్రజలు ఎలా స్పందిస్తారనేది మీకే తెలుస్తుంది.

చివరకు ఇవాళ మీరు ఆత్మకూరు ఉప ఎన్నికలో ఏం చేశారనేది ప్రజలంతా చూశారు. మీరు బీజేపీ అభ్యర్థికి పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్నారు.
మేము ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తాం. ఇకపై ప్రతి నెలా కొత్తగా కంపెనీలు వస్తాయి. ప్రారంభోత్సవాలు, భూమిపూజలు జరుగుతాయి.
వాటిని చూసి మీరు కుళ్లి ఏడుస్తారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

ప్రచారం మా అభిమతం కాదు:

మేము కూడా ఎందరినో కలుస్తాం. కానీ ఎక్కడా ప్రచారం చేసుకోం. ఏదైనా కార్యరూపం దాలిస్తేనే చెబుతాం. ఎక్కడ కంపెనీ పెడితే, అక్కడే భూమి పూజ చేస్తాం. అంతే తప్ప, ఎక్కడో ఒక దగ్గర పార పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వం. అయితే మేము ఏది చేసినా, అది తామే చేశామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి.

మేము దావోస్‌కు వెళ్లి వచ్చాం. చంద్రబాబు కూడా నాలుగైదుసార్లు పోయి వచ్చాడు. ఎన్నిసార్లు ఆ పర్యటనలపై ఎన్నెన్ని మాటలు చెప్పాడు. కానీ ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా? వారు ఏదీ చేయలేదు. వారి హయాంలో ఎక్కడా కంపెనీలు ఏర్పాటు కాలేదు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.

గ్రౌండ్‌ అయ్యేలా చూస్తాం:

అదే మేము అలా ప్రచారం చేసుకోం. చేసేదే చెబుతాం. వాటిని చేసి చూపుతాం. అవి ఏర్పాటయ్యాయా? లేదా? అనేది చూస్తాం. జరిగే వాటిపైనే చెబుతాం తప్ప, అమలు కాని వాటి గురించి అస్సలు చెప్పబోం.

అపాచీతో ఒప్పందం చేసుకున్న మేరకు, ఇవాళ అక్కడ భూమి పూజ చేయడంతో పాటు, 298 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంటు కూడా ఇచ్చాం. వారు వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేస్తారు. కంపెనీ ప్రారంభం అవుతుంది. అదే విషయాన్ని సీఎం చెప్పారు.

గతంలో టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచే పార్టనర్‌షిప్‌ సమ్మిట్లు పెట్టారు. దానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఏవేవో ఎంఓయూలు చేసుకున్నట్లు చూపారు. కానీ ఎక్కడా ఏదీ రాలేదు. ఎవరూ ఏ కంపెనీని ఏర్పాటు చేయలేదు.
ఇంకా చెప్పాలంటే అధికారం కోసం సొంత భార్యనే రోడ్డు మీద నిలబెట్టిన ఘనుడు చంద్రబాబు. అంత నీచంగా రాజకీయాల్లో ఎవరూ దిగజారరు.

 

LEAVE A RESPONSE