Suryaa.co.in

Features

ఆయనలోన గాలివాన..!

ఓ గాలివాన ఆయనను
ఏకాకిని చేసింది..
అదే ‘గాలివాన’
అదే మనిషిని
ఎకాయెకిన విశ్వవిజేతగా
నిలబెట్టింది…!

పద్మరాజు కధలకు
పుట్టిల్లు ఆయన వ్యధలు..
కట్టుకున్న పూరి గుడిసె
ఓ కాళరాత్రి కమ్మేసిన
గాలివానకు కుప్పకూలితే
ఆ కల్లోలంలో ఇల్లాలు
శిథిలాల కింద ఉందో..
ఉసురే పోయిందో..
దిక్కు తోచని అయోమయంలో
బిక్కుబిక్కుమన్న పద్మరాజు
కన్నీటి సిరా..
రాసేసిన కథే కదరా..
గాలివాన..!

కళాశాలలో అయ్యోరు పాలగుమ్మి పద్మరాజు
‘బతికిన కాలేజీ’రాస్తే
ఆ కథ వాస్తవానికి
ప్రతిబింబమే కదా..!

పాలగుమ్మి విరచిత
నల్లరేగిడి
మన ఊరి కథ సినిమా..
బంగారుపాపతో మొదలై
సర్దార్ పాపారాయుడు
వరకు ఎన్నెన్నో మెరుపులు..
సమాజంపై విరుపులు..
పాతికేళ్ల నా నిజాయితీ పాతిక సంవత్సరాలుగా
పాతబడిపోయింది..
ఆ నిజం రుజువు కావడానికి
ఇంకో పాతికేళ్ళు పడుతుంది
అప్పటిదాకా ఉండేదెవరు..
పోయేదెవరు..
పాలగుమ్మి కలం..
నందమూరి గళం..
పాపారాయుడు కలకలం..
మార్మోగుతూ కలకాలం..!

పద్మరాజు కులం
కవికులం..
ఆయన కలం
కథల గంగాళం..!
పాలగుమ్మి పద్మరాజు జయంతి..24.06.1915

– సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE