-జన్మనిచ్చిన మండలానికి కాకాణి ప్రత్యేకంగా ఏమి చేశాడో చెప్పాలి
-అమాయకుడైన దళితుడిని మర్మాంగాలు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారా
-నారాయణ కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడుతాం
-పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ -పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారంటే.. కంఠంలో ప్రాణముండగా కొండను కాదు కదా బండను కూడా తాకనీయబోనని బీరాలు పలికిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రభగిరిపట్నం కొండలు కరగడం కనిపించడం లేదా? మైనింగ్ తో ప్రభగిరి పట్నం కొండలు కరిగిపోయాయి.. కాకాణి కంఠంలో ప్రాణం మాత్రం అలాగే ఉంది.నేను మంత్రిగా ఉన్న సమయంలోనూ లీజు ఉన్నప్పటికీ గ్రామస్తుల వినతి, గ్రామ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మైనింగ్ ను ఆపాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామ సమీపంలోనే మైనింగ్ చేపట్టి కొండలు కరగదీస్తున్నారు.రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో సేద్యం గిట్టుబాటు కాక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.మద్దతు ధరలు లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితి తెచ్చారు..కళ్ల ముందే పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ పంట పెట్టడానికి రైతులు జంకుతున్నారు.
ఓడినా, గెలిచినా నేను ప్రజల మనిషినే.దశాబ్దాలుగా ఎవ్వరూ చేయని, సోమశిల దక్షిణ కాలువ పనులు, కండలేరు ఎడమ కాలువకు లిఫ్ట్ నేనే సాకారం చేశాను.కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కాకాణి అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై పోరాడింది లేదు.జన్మనిచ్చిన పొదలకూరు మండలానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేకం ఏమి చేశాడో ప్రజలకు చెప్పాలి. మద్దతు ధర లేక జిల్లాలో రైతులు 3 వేల కోట్లు నష్టపోతే, ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రికి నోరు మెదిపే దమ్ములేకుండాపోయింది..మర్మాంగాల మీద కొట్టడంతోనే ఉదయగిరి నారాయణ చనిపోయినట్టు పోస్టుమార్టంలో తేలినట్టు తెలిసింది.అమాయకుడైన దళితుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి దానిని మళ్లీ సమర్ధించుకునేందుకు పొదలకూరు సీఐ ప్రెస్ మీట్ నిర్వహించడం హాస్యాస్పదం.నారాయణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
సీఎం జగన్ రెడ్డి తన పాలనతో ఆర్థికంగా, రాజకీయంగా రాష్ట్రం పతనమయ్యే పరిస్థితులు తెచ్చారు.రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది.వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని కోరుతున్నా.. కార్యక్రమంలో పాల్గొన్న పొదలకూరు, టీపీ గూడూరు మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ నాయుడు, కోడూరు భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, ఆదాల సుగుణ, కృష్ణయాదవ్, కాకు పెంచలయ్య, తిరుపతి, బొమ్మ పెంచలయ్య, గోగుల దయాకర్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.