ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు…మన పిల్లలకు మనం చిన్నతనం నుండి ఏమీ నేర్పుత ఉన్నామని ప్రతీ తల్లీ తండ్రి ఆలోచన చేయాలి..ఒకరిమీద చెడు అభిప్రాయం కలిగేలా… జల్సాలు..ఆడంబరమైన అలవాట్లు చిన్నతనంలో నేర్పితే…అదే కరెక్ట్ అనుకుంటూ పెరిగి… నేడు పెద్దలకు… సమాజానికి కీడు చేసే విధంగా ఎదిగిన విదానంపై ప్రతీ తల్లీ తండ్రి గమనించాలి.
అలానే నాడు నేడు
నాడు కలిసి ఉంటే కలదు సుఖం, నేడు కలిసి ఉంటే కలదు దుఃఖం.
నాడు తృప్తికి త్యాగానికి బానిసలం, నేడు బీపీ షుగర్లకు వారసులం.
నాటితరం అరవైలో ఇరవై, నేటితరం ఇరవై లో అరవై.
నాడు అనురాగాలకు ఆప్యాయతలకు వారసులం, నేడు టీవీలకు సెల్ ఫోన్లులకు కట్టు బానిసలం.
నాడు లేమిలోనే కలదు తృప్తి, నేడు కోట్లు ఉన్నా లేదు సంతృప్తి.
నాడు ఆరుబయటే హాయి నిద్ర, నేడు వీలున్నా లేని నిద్ర.
నాడు కళలకు భారతావని పుట్టినిల్లు ,నేడు అవినీతికి నల్లధనానికి మెట్టినిల్లు .
నాడు సంపాదన జీవనభృతి కోసం ,నేడు సంపాదన తృప్తిలేని జీవనం కోసం.
నాడు మానవ సంబంధాలన్నీ భోగభాగ్యాలు ,నేడు మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలు.
నాటి మనిషి ఆస్వాదించాడు నవరసాలు , నేటి మనిషి ఆస్వాదిస్తున్నాడు సారంలేని రసాన్ని .
నాడు ఇల్లు వాకిళ్ళు అమ్మానాన్నలతో ఆనంద నిలయాలు ,నేడు వృద్ధాశ్రమాలే ఆ జీవచ్ఛవాలకు నిలయాలు.
నాడు బలానికి శక్తికి నెలవైన పప్పు చెక్కలు సున్నుండలు, నేడు రోగాలకు నెలవైన పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్ లు.
ఇది ఎంతవరకు వాస్తవమో ఎవరికి వారే ప్రశ్నించుకోండి.
– రతన్.బి