ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎకరం 10 లక్షల చెప్పున ఓ ఇరవై ఎకరాలు కొనుగోలు చేస్తారు….
అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వెర్షన్ ఫీజు కట్టి గజాల్లోకి మారుస్తారు . అక్కడ మార్కెట్ విలువ గజం 200/- రూపాయలు. ప్రభుత్వ విలువ గజం 100/- రూపాయలు ఉంటుంది. వారి చుట్టాలకు అందులో గజం 6000/- చెప్పున ఓ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా రెండు మూడు ట్రాన్సాక్షన్ లు. వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు…. ఆ సర్వే నెంబర్ అంతా గజం 6000/- మారిపోతుంది.
మేము పెద్ద ఇండస్ట్రీ కడుతున్నాము… బ్యాంకులోను కావాలి… షూరిటీ గా 60,000/- గజాలు పెడతాము…
అక్కడ గజం 6000/- ఉంది అని బ్యాంకు కు చెబుతారు. సబ్ రిజిస్ట్రార్ రికార్డ్ ప్రకారం అక్కడ గజం 6000/- కనపడుతుంది.. మార్కెట్ వాల్యూ మాత్రం 200/-. ఆ విషయం బ్యాంకు వాడికి కూడా తెలుసు..పై నుంచి ఫోన్ లు , ఆమ్యామ్యాలు..కాదనలేరు. కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్ వచ్చేస్తుంది..
తరువాత ఇండస్ట్రీ పెడతారు.
100 రూపాయలుకు అయ్యేదాన్ని 10,000/- ఖర్చు అయినట్లు లెక్క చూపెడతారు….ఆన్ ఫీల్డ్ మీద 100 రూపాయలు ఉంటే ఇంటికి 9900/- చేరిపోతుంది.. తరువాత లాస్ చూపెడతారు .. కంపెనీ మూసేస్తారు..బ్యాంకు వాడు ఆక్షన్ వేస్తాడు …100/- కు 10/- రూపాయలు ముడుతుంది…
ఆ నష్టాలు మన మీద రుద్దడానికి, మినిమమ్ డిపాజిట్ లేకపోతే ఫైన్ …పక్క ఎటిఎమ్ లో డ్రా చేస్తే ఫైన్, ఇన్ని ట్రాన్సాక్షన్ లు దాటితే ఫైన్, అంటూ
మధ్య తరగతి పేద ప్రజల పొట్ట కొడతారు.
– కిశోర్