Suryaa.co.in

Andhra Pradesh

షర్మిలమ్మ, భారతమ్మ, బ్రదర్ అనిల్ కి అమిత్ షా జెడ్ కేటగిరి ఇప్పించాలి

– 50 శాతం అదాయం అదాన్ డిస్టలరీస్ కి ప్రభుత్వం ఇస్తోంది
-ఈ కంపెనీకి డిస్టలరీ లేదు, ఏమీలేదు
– ఉచ్చ బాటిల్ లో పోసి ఇచ్చినా తాగేస్తారనే భ్రమలో జగన్, విజయసాయిలు ఉన్నారు
– చంద్రబాబు, లోకేష్ ల చదువుతో జగన్ చదువును పోలుస్తారా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

చంద్రబాబు, లోకేష్ ల చదువుతో జగన్ చదువును పోలుస్తారా? వారి చదువు ఉన్నతమైనది. జగన్ ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు. సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సరఫరా చేస్తున్న మద్యంలో విషపూరిత కాంపౌండ్స్ ఉండడంపై మూడంచనాల టెస్టింగ్ చేస్తున్నామడం సమస్యను దాటవేసే ప్రక్రియలో భాగమే. లిక్కర్ అండ్ డిస్టలరీస్ అసోసియేషన్ వారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క ముఖ్యమైన మనిషి కూడా లేకపోవడం వారి డొల్లతనాన్ని బయటపెడుతోంది.

ముఖ్యమైన వ్యాపారస్థులు పాల్గొనాల్సిన ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనలేదు. అదాన్ డిస్టలరీస్ కంపెనీ వారు పాల్గొనాల్సింది పాల్గొనలేదు. ఈ కంపెనీ జగన్ కు చెందినదే కావున వేక్ గా తీసుకున్నారు. జగన్, విజయసాయిరెడ్డి లు సూట్ కేస్ కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. వీరికి చెందిన ఉత్తుత్తి కంపెనీలు దాదాపు రెండు వందలు ఉన్నాయి. 2019 డిసెంబర్ 2వ తేదీన అదానీస్ అనే కంపెనీని పెట్టారు. జగన్ కు చెందిన కంపెనీ కాబట్టి తిరుగులేకుండా సాగింది. 50 శాతం అదాయం అదాన్ డిస్టలరీస్ వారికి నేడు ప్రభుత్వం ఇస్తోంది.

ఈ రెండు సంవత్సరాల్లో 68 లక్షల కేసులు సప్లయి చేశారు. 1,164 కోట్లు టర్నోవర్. ఈ కంపెనీకి డిస్టలరీ లేదు, ఏమీలేదు. జగన్, విజయసాయివి దొంగ సారాయి వ్యాపారం, దొంగ కంపెనీలు. ఉచ్చ బాటిల్ లో పోసి ఇచ్చినా తాగేస్తారనే భ్రమలో జగన్, విజయసాయిలు ఉన్నారు. డిస్టలరీల స్థాపనకు స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసిజర్ ఉంటుంది. వాటిని ఫాలో కాలేదు. జగన్ సరఫరా చేస్తున్న మద్యంలో ఉండాల్సినవి లేవు, ఉండకూడనివి ఉన్నాయి. తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకుంటారనుకుంటే లేదు. పైగా మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి నోటీసులు, బెయిలు, జెయిలు తప్ప ఏమీ తెలియవు.

నల్లధనాన్ని విదేశాలకు ఎలా తలరలించాలి జగన్, విజయసాయికి బాగా తెలుసు. ఇటీవల ఫ్రాన్స్ కు ఎంత డబ్బులు పంపారో తెలియాలి. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య విచారణకు తొలుత సీబీఐ కావాలంటావు. నీ అవసరాలు తీరిపోతే సీబీఐ ఎంక్వైరీ వద్దంటావు. ఇది ఎంతవరకు సమంజసం? జగన్ ది రక్త చరిత్ర అని అందరికీ తెలుసు. తండ్రి మరణంలో జగన్ పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనవసరంలేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. ఎవరు ఎవర్ని చంపుతారో అని జనాల్లో భయం నెలకొంది. విజయమ్మకు, షర్మిలమ్మకు, భారతమ్మకు, బ్రదర్ అనిల్ గారికి అమిత్ షా జెడ్ కేటగిరి ఇప్పించాలి. వారికి ఏదైనా జరిగితే అది మామీదకు వస్తుంది.

ప్రజలు ఏం కోరుతున్నారో అది చేయక సొల్లు మాటలు మాట్లాడుతుంటారు. ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అవినీతిని అదుపు చేయాలి. రౌడీయిజానికి స్వస్తి పలకాలి. కాళహస్తిలో టెంపుల్ వద్ద ఒక రిపోర్టర్ ని వైసీపీ నాయకుడు కొట్టడం చూశాను. ఎంత అమానుషం. రిపోర్టర్లు వైసీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపైన దాడులు చేస్తారు. ఈ అవినీతి, అక్రమాలు ఎంతోకాలం సాగవని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు.

LEAVE A RESPONSE