Suryaa.co.in

Andhra Pradesh

9న రాష్ట్రవ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ముందు నిరసనకు టిఎన్ఎస్ఎఫ్ పిలుపు

-3, 4 ,5 తరగతుల పాఠశాలల విలీనం ఆపాలంటూ జూలై 9న రాష్ట్రవ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ముందు నిరసనకు టిఎన్ఎస్ఎఫ్ పిలుపు

3,4,5 తరగతుల విలీనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల పాఠశాలలను విలీనం చేసి ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా చేసే జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ కార్యాలయాల ముందు నిరసనకు ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. జీవో నెంబరు 117 గ్రామాలలో బాలికల విద్య కు శాపంగా మారిందని, దీనితో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లారని విద్యార్థులకు మేనమామ గా ఉంటానని కంస మామ గా మారారని, బాలికల విద్యకు జగన్ రెడ్డి కంటకుడుగా మారి, గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా చేస్తున్నారని అన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచే తల్లిదండ్రులు మా గ్రామంలో పాఠశాలలు మాకే ఉంచాలి. ‘మా పాఠశాల – మా హక్కు’ అనే నినాదంతో, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ ను వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తుంటే, ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ…కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను విలీనము చేయవలసిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ కూడా పేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలపై ఉక్కుపాదంతో జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి రేషనలైజేషన్ పేరిట విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి, స్టూడెంట్ టీచర్ రేషియో తో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అకారణంగా ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే విధంగా, భవిష్యత్తులో పది సంవత్సరాల వరకు డీఎస్సీ అవసరమేరానట్లుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. దీనిపై విద్యావేత్తలు విద్యార్థులు మేధావులు అందరూ స్పందించి పాఠశాలల విలీన ప్రక్రియపై పోరాటానికి సిద్ధం కావాలని… అందులో భాగంగా జూలై 9 శనివారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖాధికారి కార్యాలయాల ముందు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతునిచ్చి విజయవంతం చేయాలని, టిఎన్ఎస్ఎఫ్ కార్యవర్గం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలలో పాల్గొంటుందని జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 117 ను వెనక్కు తీసుకునే వరకు విలీన ప్రక్రియ ఆపేంత వరకు పోరాటం చేస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలిగించే, విద్యార్థి వ్యతిరేక ప్రజాకంటక జీవోలను రద్దు చేసే వరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE