Suryaa.co.in

Andhra Pradesh

అద్దె మనుషులతో వైసిపి ప్లీనరీ నడుస్తోంది

-చిత్తూరు జిల్లా నగిరిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

• వైసిపి ప్రభుత్వ బాదుడుపై ప్రశ్నించడానికి రోడ్ షోకు వచ్చాను.
• అద్దె మనుషులతో వైసిపి ప్లీనరీ నడుస్తోంది.
• జగన్ ప్రభుత్వం నవరత్నాలు కాదు…నవ ఘోరాలు.
• జగన్ ప్రజల్లోకి వస్తే ప్రజల ఆగ్రహం అర్థం అవుతుంది.
• జగన్ పులివెందులలో కూడా పరదాలు, బారికేడ్లు పెట్టుకుని తిరుగుతున్నాడు
• ఒకప్పుడు పాదయాత్ర అని ఇంటింటికి వెళ్లి పెట్టిన ముద్దులు ఏమయ్యాయి.
• ఇప్పుడు ప్రజలను జగన్ గుద్దుడే గుద్దుడు.
• దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎపిలోనే ఎక్కువ
• మనకంటే తమిళనాడులో మద్యం ధర తక్కువ.
• మద్యం కోసం కూడా పొరుగు రాష్ట్రం వెళుతున్నారు.
• జగన్ రెడ్డి అక్రమాల వల్లనే ఎపిలో మద్యం ధరలు పెరిగాయి.
• రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం హానికరం…విష పదార్థాలు ఉన్నాయి.
• హానికర మద్యంపై రాష్ట్ర ప్రజలకు ప్లీనరీలో జగన్ సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నా
• జగన్ వచ్చిన తరువాత రాష్ట్రంలో కరెంట్ చార్జీలు ఆరు సార్లు పెరిగాయి.
• దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా…ఎపిలో తగ్గించలేదు.
• ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే…టిడిపి మహానాడుకు భారీగా జనం వస్తున్నారు.
• చెత్తపన్నుపై చెత్త వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
• 15 శాతం ఇంటి పన్ను పెంచి భారం వేశారు.
• చేనేత రావాల్సిన విద్యుత్ సబ్సిడీ ఎపిలో ఎందుకు రావడం లేదు.
• టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేతలకు 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తాం.
• పెన్షన్ ఎంత పెంచుతా అని జగన్ చెప్పాడు….ఎంత పెంచాడు.
• 3000 పించన్ ఇస్తాను అన్నాడు…కానీ ఇప్పటికీ 2500 మాత్రమే ఇస్తున్నాడు
• ఒంటరి మహిళల పెన్షన్ కూడా నిలిపివేసిన సిఎం జగన్
• నగిరిలో టిడిపి వచ్చిన తరువాత టెక్స్ టెయిల్ పార్క్ తెస్తాం.
• ప్రభుత్వం ఏమీ తేవడం లేదు కానీ….అందరి జేబులకు కన్నం పెడుతుంది.
• వడ్రంగి, డాక్టర్, కిళ్లీ కొట్టు వాళ్లకూ జగన్ వృత్తి పన్ను వేస్తున్నాడు.
• జేబులకు కన్నం వేసే ముఖ్యమంత్రిని దొంగ అనాలా…ఏమి అనాలి.
• మన గ్రామంలో చిన్న డ్రైనేజ్ కాలువ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతాడా
• పంట కాలువ తవ్వలేని సిఎం….సాగునీటి ప్రాజెక్టులు కడతాడా
• సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి….సీమకు నీళ్లు రావాలి
• నేను ఉంటే పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చే వాడిని
• పేద వాడికి తిండి పెట్టే అన్న క్యాంటీన్ ఎందుకు తీసివేశారో చెప్పగలరా
• 5 రూపాయలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్ రద్దు చెయ్యడం పేదవాళ్లపై ప్రేమా
• డిఎంకె పాలన వచ్చినా తమిళనాడులో అమ్మ క్యాంటీన్ కొనసాగించారు.
• హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ, ప్రాజెక్టులు కూల్చి వేసి ఉంటే అభివృద్ది జరిగేదా
• నా మీద కోపంతో అమరావతి ఆపేశారు..ఇది న్యాయమా
• పాలకులు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి
• రాష్ట్రంలో ఇసుక ఎందుకు దొరకడం లేదు….ప్రజలు ఆలోచించాలి
• ఈ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి…ఎలుకలు మద్యం తాగుతున్నాయి….ఉడతలు కరెంట్ తీగలు కొరుకుతున్నాయి…తేనె టీగలు రథాలు కాల్చేస్తున్నాయి.
• ఒక్క సారి అని కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుంది…..నేడు అప్పుడే చెప్పాను మీరు వినలేదు
• రాష్ట్రంలో 10 వేల స్కూళ్లు మూసివేశారు.
• నేను ఒకే ఆర్డర్ తో ప్రతి గ్రామంలో స్కూలు వచ్చేలా చేశాను….కాని జగన్ ఒక్క ఆర్డర్ తో 10 వేల స్కూళ్లు మూసివేశాడు.
• అమ్మఒడి బూటకం…నాన్న బుడ్డి వాస్తవం.
• 300 యూనిట్లు వాడినా, 75 శాతం అటెండెన్స్ లేకపోయినా అమ్మఒడి కట్
• 10వ తరగతి ఫలితాల్లో దారుణ ఫలితాలు వచ్చాయి. ఇంటర్ లోను అదే జరిగింది.
• పరీక్షల్లో ఫెయిల్ అయ్యి 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు…ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
• 2.50 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు రావడం లేదు అని సర్వ శిక్ష అభియాన్ లో నివేదిక ఇచ్చారు.
• వివేకా హత్య విషయంలో నాపై ఏమి రాశారు….నేను హత్యా రాజకీయాలు ఎప్పుడూ చెయ్యలేదు.
• నాపైనా తప్పుడు కేసులు పెట్టారు….ఇప్పుడు పెగాసస్ అని కొత్త కేసు అంటున్నారు.
• డాటా చోరీ జరిగిందా…..ఆరోపణ చేస్తే అర్థం ఉండాలి.
• కేసులతో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు….కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.
• సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 600 మంది పై కేసులు పెట్టారు…180మందిని అరెస్టు చేశారు.
• అచ్చెన్నాయుడు మొదలు ఎంతో మందిని అరెస్టు చేశారు.
• ప్రభుత్వానికి మానవత్వం ఉంటే నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకునేదా
• తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను చంపేసి శవాన్ని ఇంటికి తీసుకు వచ్చాడు.
• జగన్ అందరినీ వాడుకున్నాడు వదిలేశాడు…తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేశాడు.
• వైసిపి కి శాశ్విత అధ్యక్షుడిగా జగన్ ఉంటారంట….ఇదేమి నిర్ణయం.
• మూడేళ్లలో అవినీతి ద్వారా జగన్ లక్షా 75 వేల కోట్లు సంపాదించాడు.
• ప్రభుత్వ పథకాలు ఎంత మందికి ఇచ్చారో…ఎవరికి ఇచ్చారో ఆన్ లైన్ లో పెట్టగలరా
• చీకటి జీవోలు వద్దు…చీకటి పాలన వద్దుస
• రాష్ట్రంలో ఏమీ ఉన్నా లేకున్నా…..సాక్షిలో ప్రతి మూడు రోజులకు ఫుల్ పేజీ ప్రకటన
• 220 ఉండే సిమెంట్ బస్తా ఇప్పుడు 400 అయ్యింది…జగన్ వల్లనే సిమెంట్ ధర పెరిగింది.
• భారతీ సిమెంట్ కోసం రాష్ట్రంలో సిమెంట్ ధర పెంచారు.
• పేదలకు ఇచ్చిన విదేశీ విద్యాను ఎందుకు తీసివేశారు….మీ పిల్లలు మాత్రమే విదేశాల్లో చదవాలా.
• 51 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చెయ్యడం లేదు.
• రాష్ట్రంలో జగన్ మటన్ కొట్లు, ఫిష్ మార్ట్ లు తెచ్చాడు. నేను ఐటీ, టీచర్, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాను.
• మైనారిటీ ఆడబిడ్డల కోసం దుల్హన్ పథకం తెస్తే…జగన్ రద్దు చేశాడు.
• జగన్ 100 శాతం హామీలు అమలు చెయ్యడం కాదు….100 శాతం మోసం చేశాడు
• అమరావతి పూర్తి చేస్తాను అన్న మాట జగన్ మాట ఏమయ్యింది…పోలవరం ఏమయ్యింది…జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు.
• ఎస్ సి, ఎస్టి ల కోసం తెచ్చిన 28 పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఇది
• బిసిలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ టిడిపి…స్ధానిక సంస్ధల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిని తగ్గించారు.
• 50 మంది బిసిలకు కుర్చీలు లేని కార్యాలయాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు
• ఆడబిడ్డలకు ఆస్థి హక్కు, విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది టిడిపి
• ఒకే ఇంట్లో పిల్లలు కలిసి పాఠశాలలకు వెళ్లకుండా స్కూళ్ల విలీనం చేశాడు
• రాష్ట్రంలో ఉన్న రోడ్ల గుంతలకు మట్టివెయ్యలేని సిఎం రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారా
• ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కారణం ప్రభుత్వం
• మద్యం, గంజాయి వంటి వాటితో మానవ మృగాలుగా తయారు అయ్యారు
• డ్రైవింగ్ రాని జగన్ రాష్ట్రాన్ని రివర్స్ లో వెనక్కి తీసుకువెళుతున్నాడు
• గాలేరు నగరి పూర్తి చెయ్యాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలి
• జిల్లాల ఏర్పాటుపై జరిగిన తప్పులు సరిదిద్దుతా.
• నగిరి తిరుపతిలో ఉండాలి అంటే అక్కడే ఉంచుతా….
• డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ రావాలి…వచ్చిందా…రైతులు పోరాడాలా వద్దా.
• వ్యవసాయానికి సబ్సిడీలో పనిముట్లు ఇచ్చాడా….పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు
• ఎన్టీఆర్ నాడు 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చాడు.
• నాడు వైఎస్ ఉచిత విద్యుత్ అన్నాడు…ఇప్పుడు జగన్ మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు
• మోటార్లకు మీటర్లు పెడితే రైతులు అంగీకరించవద్దు
• మీటర్లపై పోరాడండి…నేను అండగా ఉంటాను.
• అమరావతి ఉంటుందని ఉంచారా…అందరికీ అమ్మఒడి అని ఇచ్చారా….ఇప్పుడు మోటార్ల విషయంలో కూడా అలాగే మోసం చేస్తారు.
• ప్రభుత్వం రైతు అకౌంట్ లో డబ్బులు వెయ్యకపోతే..రైతు మోటార్లు విద్యుత్ కట్ చేస్తారు.
• ముఖ్యమంత్రి లక్షల కోట్లు తినేస్తుంటే….స్థానిక మంత్రులు 10 వేల కోట్లు చొప్పున తింటున్నారు.
• ప్రభుత్వంపై పోరాటానికి అందరూ ముందుకు రావాలని కోరుతున్నా
• యువత భవిష్యత్ నిలవాలి అంటే వైసిపి పోవాలి
• నాకు జగన్ మీద కోపం కాదు….రాష్ట్రం మీద ప్రేమ
• క్విట్ జగన్…సేవ్ ఆంధ్ర ప్రదేశ్

LEAVE A RESPONSE