రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘన స్వాగతంతో పాటు ఘన సత్కారం లభించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ ఏపీలోని ప్రజా ప్రతినిధులను కోరేందుకు ఏపీకి వచ్చిన ముర్ముకు గన్నవరం ఎయిర్ పోర్టులో వైసీపీ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా ముర్ముకు సతీసమేతంగా సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ఆమెను చీర సారెతో వారు సత్కరించారు. వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆమెకు అందించారు. అనంతరం ముర్ముతో కలిసి ఆమె కారులోనే జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను స్వయంగా జగన్… ముర్ముకు పరిచయం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను ఆయన నివాసంలో కలుసుకున్న రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి కిషన్రెడ్డి. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి దంపతులు. ద్రౌపదిముర్మును సత్కరించిన సీఎం. pic.twitter.com/YkVAzSjueC
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 12, 2022
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 12, 2022