– పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ రెడ్డి మాటలే తప్ప చేతలు శూన్యం
– టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు
పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డివి మాటలే తప్ప చేతలు శూన్యమని లేదని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు పేదల ఇళ్ల నిర్మాణంపై ఆర్బాటంగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంపై సమీక్ష జరిగిన ప్రతిసారి పేదలకు ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు చెప్పడమే తప్ప అవి ఆచరణలో చూపటం లేదు.
3 ఏళ్ల వైసీపీ పాలనలో కేవలం 4 శాతం మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. జగనన్న కాలనీల పేరుతో మౌలిక సదుపాయాలు లేని చోట ఎక్కడో ఊరికి 30 కి.మీల దూరంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఆ స్థలాలు చెరువులని తలపిస్తున్నాయి. మొదట 15లక్షల 60వేల ఇల్లు నిర్మాణం చేస్తామని 2021లో శంకుస్థాపన చేశారు. నేటికి కేవలం 4శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇల్ల నిర్మాణం పేరుతో ప్రతీది దోపిడి చేస్తున్నారు. ఇళ్ల స్థలాల చదును పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రూ. 7వేల కోట్లు దోచిపెట్టారు. ఇళ్ల స్థలాల్లో మౌళిక సదుపాయాలకు రూ. 32వేల కోట్లు కావాలని కేంద్రం నుంచి సాయం కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ రాశారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మలేదు కనుకనే ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఇళ్ల నిర్మాణానికి పేదల నుంచి 7 లక్షల అర్జీలు వస్తే కేవలం 3.5లక్షల కి కుదించారు. ప్రభుత్వానికి భారతి సిమెంటు ధర పెంచి రూ.425లు అమ్ముకోడానికి ఉన్న శ్రద్ద పేదల ఇళ్ల నిర్మాణంపై లేకపోవటం సిగ్గుచేటు. 15లక్షల 60వేల ఇళ్లకి కేవలం 60 వేల ఇల్లను మాత్రమే పూర్తి చేశారు. పునాదులు వేయాల్సిన ఇల్లలో కనీసం 20 శాతం కూడా పూర్తి చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పక్కా గృహాల కోసం కేంద్రం ఇచ్చే రూ. 1.5 లక్షలకు అదనంగా మరో లక్ష రూపాయిలిచ్చ్చాం. 5 ఏళ్లలో మొత్తం 12.73 లక్షల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం నిర్మించింది.
జగన్ రెడ్డి ప్రభుత్వం జేబు దొంగలు నయం అనుకొనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. పంచాయితీలు, మున్సిపాలిటీల నిధులు రూ. 12 వేల కోట్లు దారి మళ్లించారు. ఉద్యోగస్తుల గ్రాడ్యుటీ నుంచి రూ. 900 కోట్లు మళ్ళించారు. పేదలకు కల్తీ మద్యం అమ్మి ఆ డబ్బుతో సంక్షేమ పథకాలు పేరుతో మభ్యపెడుతున్న వైసీపీని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడు అనడం దుర్మార్గం. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వైర్లు కూడ నాసిరకం కొని సప్లై చేస్తోంది.
ఉడత వైరు మీద వెల్లడం వల్ల వైరు తెగిపోవడం వల్లే 5 మంది చనిపోయారని చెప్పడం ప్రభుత్వ నైజాన్ని బయటపెడుతోంది. ప్లీనరీ సమావేశాలు చంద్రబాబు నాయుడుని తిట్టడానికే పెట్టారు. రాష్ట్ర ప్రజలంతా వైసీసీ పాలన పట్ల విసుగు చెంది ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని అంగర రామ్మోహనరావు అన్నారు.