Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ నిధులతోనే పోలవరం పనులు

జలవనరులశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
–పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష

పోలవరం – ముందస్తు వరదలు
– పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సీఎం సమగ్ర సమీక్ష.
– పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్‌–1, గ్యాప్‌–2లు పూడ్చే పనుల అంశంపై సమావేశంలో విస్తృత చర్చ.
– పోలవరం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంకు సంబంధించి గ్యాప్‌ 1, గ్యాప్‌ 2లు రెండింటినీ పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమన్న అధికారులు.
– ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని తెలిపిన అధికారులు.
– చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్న అధికారులు.
– వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తిచేస్తామన్న అధికారులు.
– మరోవైపు షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాఫర్‌డ్యాం పనులకు కూడా ముందస్తు వరదల కారణంగా అంతరాయం ఏర్పడిందన్న అధికారులు.
– గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదన్న అధికారులు.
– వరదలు పూర్తిగా తగ్గితే… ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామన్న అధికారులు.
– ఈ పరిస్థితి రాగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధంకావాలన్న ముఖ్యమంత్రి.

– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందన్న సీఎం.
– పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– కాంపొనెంట్‌ వైజ్‌గా రీయింబర్స్‌ చేసే విధానంలో కాకుండా.. అడహాక్‌గా డబ్బులు తెప్పించుకుంటే…, ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చన్న సీఎం.
– వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం.
– ఈమేరకు అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలన్న సీఎం. ఈమేరకు కేంద్రానికి లేఖలు కూడా రాయాలన్న సీఎం.
– పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్‌ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

ఆగష్టులో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
– ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామన్న అధికారులు.
–బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, అది కూడా త్వరలో చేరుకుంటుందని తెలిపిన అధికారులు.
– దసరా నాటికి అవుకు టన్నెల్‌–2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు.

–వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ – 2పనులపైనా సీఎం సమీక్ష.
– ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్న అధికారులు.
– ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్న సీఎం.
ఆ మేరకు పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
– నెలవారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం.
– వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్న అధికారులు.
– అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలంకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామన్న అధికారులు.

– ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి,రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు, వీటితోపాటు చింతలపూడి, వైయస్సార్‌ పల్నాడు, మడకశిర బైపాస్‌ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాలను నిర్దేశించిన సీఎం.

కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి
– దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉంది:
– ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది:
– నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఇది:
– దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి కార్యాచరణ సిద్ధంచేయాలి:
– భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలి:
– ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలి:
– దీనివల్ల ప్రజలకు వ్యాపకం దొరుకుతుంది, వలసలను నివారించగలుగుతాం:
– ఐటీఐ, పాలిటెట్నిక్, ఇంజినీరింగ్‌ కాలేజీలు తదితర విద్యాసంస్థల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధంచేయాలి:
– ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.

ఈ సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE