– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ రెడ్డి గారు మీరు పంపే ఫ్యామిలీ డాక్టర్ వచ్చేలోగా జనాలు బతికేలా లేరు. సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది. విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందారు. వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? బటన్ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా?