-విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే
– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే “ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ” పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు… ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం… ఇప్పుడు “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించింది. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే. ఇది జగన్ అహంకారమే. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం.