– బీజేపీ నేత లంకా దినకర్
రాష్ట్రంలో దేవాలయాలని ఆదాయ వనరుగా జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చూడడం అలవాటు గా మారింది. 1,176 దేవాలయాల 353.80 కోట్ల డిపాజిట్ల పై, జగనన్న నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది. ఇప్పుడు దేవాలయాల డిపాజిట్ల పైన కన్నేసింది అంటే గుడిని, గుడిలో లింగాన్ని జగనన్న ప్రభుత్వం మింగడమే.
గతంలో టీటీడీ బంగారం పైన, డిపాజిట్ల పైన కన్ను వేసి, భక్తుల ఆగ్రహనికి గురైతే.. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం దొడ్డిదారిన దేవాలయాల నుండి లాగే ప్రయత్నం చేస్తుంది.మిగతా మతాల ఆదాయాలపై లేని చూపు, హిందూ దేవాలయాల పైన విషపు కన్ను ఈ ప్రభుత్వానికి ఎందుకు? గతంలో ఆర్డినన్స్ నెం 14/2021 ద్వారా సంవత్సరానికి 2.50 కోట్లు టీటీడి చెల్లంచే సీజీఏఫ్, ఏడెబల్యూఏఫ్ , ఈఏఏఫ్ ని ఒక్కసారిగా 50 కోట్లకి పెంచిన జగనన్న ప్రభుత్వం.
ఈ 50 కోట్లు తక్కువ ఆదాయం ఉన్న దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల నిర్వహణ కి వాడతామన్నారు, మరి అలా ఎన్ని దేవాలయాల నిర్వహణ జరుగుతుంది?
ఇప్పటికే టీటీడీతో పాటు, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం, కాణిపాకం వినాయక దేవాలయం, సింహచలం అప్పన్న తదితర దేవాలయల ద్వారా భారీ అదాయం రాష్ట్ర ప్రభుత్వం పొందుతున్నది.