Suryaa.co.in

Telangana

10వేల వరద బాధిత సిబ్బందికి నోటీసులు?

గత సంవత్సరం హైద్రాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దింతో కేసీఆర్ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు 10వేలు ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యత జీ.హెచ్.ఎం.సి అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. కానీ అధికారులు , సిబ్బంది నిజమైన వరద బాధిత కుటుంబాలకు ఇవ్వకుండా స్థానిక నాయకుల బంధువులకు, వారు సూచించిన వ్యక్తులకు ఇవ్వడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జీ.హెచ్.ఎం.సి ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ కు సీట్లు తగ్గడం కూడా ఇది ఒక కారణమే. వరద బాధిత కుటుంబాల కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన్నట్లు ప్రభుత్వం గుర్తించి సదరు అధికారులకు, సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నోటీసులు ఇవ్వడంతో అధికారులకు, సిబ్బంది గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి.

LEAVE A RESPONSE