-వ్యవసాయ రంగానికి వైసీపీ ప్రభుత్వం చేసిన తీరని ద్రోహంపైనే రైతుపోరు
-మనుబోలులో రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే రైతు పోరుకు వేలాదిగా రైతులు
-నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమై రైతుపోరు ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా పొలిట్ బ్యూరో -సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులు పడే పాట్లు, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన తీరని ద్రోహంపై రైతు పోరు పేరుతో ఉద్యమం చేపట్టాం.ఇప్పటికే రాష్ట్రంలో మూడు జోన్ల పరిధిలో విజయవంతంగా పోరాట సభలు నిర్వహించాం. రేపు నాలుగో జోన్ గా ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి మనుబోలులో మధ్యాహ్నం 3.30 గంటలకు హైవే పక్కనే రైతుపోరు నిర్వహిస్తున్నాం.
నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వేలాదిగా రైతులు తరలివస్తున్నారు.మోటార్లకు మోటార్లు పెడితే రైతుల మెడకు ఉరి బిగించినట్టే…ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందుకే సాగడం దురదృష్టకరం.జగన్ రెడ్డి నిలకడలేమి విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మాట తప్పి…మడమ తిప్పి ఆక్వా రంగాన్ని ముంచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2గా ఉన్న ఆక్వా విద్యుత్ చార్జీలను రూ.1.50కి తగ్గినట్టే తగ్గించే ఈ రోజు జోన్, నాన్ జోన్ పేరుతో పన్నుల కలిపి రూ.4.85 బాదేస్తున్నారు. మూడేళ్ల పాలనలో రైతులను జగన్ రెడ్డి చేసిన మోసాలను రైతుపోరు వేదికగా వివరిస్తాం. మొన్నటి వరకు వ్యవసాయం అంటే అర్థం తెలియని కన్నబాబు ఆ శాఖ మంత్రిగా వెలగబెట్టారు.. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు.
బడ్జెట్ కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చుపెట్టకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం వ్యవసాయ శాఖను మూత వేసుకుంటూ వస్తున్నారు. ఇంత దుర్మార్గంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ సీఎం వ్యవహరించలేదు.రూ.1.30 లక్షల కోట్లను మూడేళ్లలో రైతుల కోసం ఖర్చుపెట్టినట్టు పత్రికల్లో కోట్లు వెచ్చించి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం…ఈ విషయంలో రైతులతో కలిసి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.
సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ, కప్పిర శ్రీనివాసులు, సారంగం గున్నయ్య, కప్పిర రేవతి తదితరులు