Suryaa.co.in

Features

ఎంటర్ కి ముందే ఎగ్జిట్..

అది మంత్రమా..తంత్రమా..
మహావీరుడు బ్రూస్లీ
తనకు తానుగా ఆవిష్కరించిన సూత్రమా..
అసలు అతగాడో యంత్రమా!

వన్ ఇంచ్ పంచ్..
అంగుళం దూరం
నుంచి కొడితే
అదిరిపోదా భూగోళం..
కొడితే కొట్టాలిరా
కుంభస్థలమే
బద్దలు కొట్టాలిరా..
అంతకు ముందు
సినిమా లోకానికి
పెద్దగా తెలియని కుర్రాడు..
ఎంటర్ ది డ్రాగన్…
ఒక్క సినిమాతో
ప్రపంచం దిమ్మదిరిగేలా
బొమ్మ చూపించాడు..
సూపర్ స్టార్ అయ్యాడు..
వసూళ్ల వర్షం కురిపించాడు..!

అంతకు మునుపెన్నడూ చూడని విన్యాసాలు..
కండలు తిరిగిన శరీరం..
చురుకైన కళ్ళు..
అతి వేగంగా కదిలే కాళ్ళు..
పదునైన చేతులు..
ఆ మెలకువలు..
కరాటే..కుంగ్ ఫు..
అప్పటి వరకు పెద్దగా తెలియని యుద్ధ కళలు..
పట్టింది బ్రూస్లీ పిచ్చి..
కుర్రకారు తెగ నచ్చి..
పెద్దోళ్ళూ మెచ్చి..!

పెతివోడూ కరాటే స్టూడెంటే
ప్రతి ఇంటా కరాటే డ్రస్సు..
కోచింగ్ సెంటరే అడ్రస్సు..
అదో వెర్రి..
బ్రూస్లీ మేటనీ ఐడల్..
రోల్ మోడల్..
కరాటే ఫీవర్..
అతగాడే ఫేవర్..!

అప్పటికి చాలా మందికి తెలియని నిజం..
తేరుకోలేని విషాదం..
సూపర్ హిట్టయింది
ఎంటర్ ది డ్రాగన్..
అప్పటికే బ్రూస్లీ గాన్..
డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిన హీరో..
వేగమే తన లక్షణం…
అంత వేగంగానే
పోయింది ప్రాణం..
సినిమాకి జనం ప్రభంజనం..
అభిమానులు థియేటర్లలో చూస్తే హీరో
దివ్యలోకాల నుంచి..!
తానెళ్లిపోయాడు
అంతేలేని ఆనందాలు
పంచులతో పంచి!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE