Suryaa.co.in

Andhra Pradesh

జీపీఎఫ్ సొమ్మును ఎప్పటిలోగా జమ చేస్తారు?

– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌లో నుంచి డ్రా చేసిన జీపీఎఫ్ సొమ్మును ఎప్పటిలోగా జమ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.దీనికి సంబంధించి ఆగస్టు 3వతేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పీఆర్సీ పై కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా ఉద్యోగుల అకౌంట్లో నుంచి ప్రభుత్వం జీపీఎఫ్ సొమ్మును డ్రా చేసిందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. డ్రా చేసిన సొమ్మును ఉద్యోగుల అకౌంట్‌లో ఎప్పటిలోగా జమ అవుతుందో కౌంటర్ వెయ్యాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE