Suryaa.co.in

International National

అమెరికా, జపాన్లో కొవిడ్ ఉగ్ర రూపం

– దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి జపాన్, అమెరికాలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్లో కొత్తగా 1.80 లక్షల మందికి కరోనా సోకగా.. అమెరికాలో 1.14 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 20,557 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు.కొవిడ్ నుంచి 19,216 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 8,79,504 మంది వైరస్ బారినపడగా.. మరో 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,81,82,232కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 64,10,337 మంది మరణించారు. ఒక్కరోజే 9,82,341 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,82,79,714కు చేరింది.

LEAVE A RESPONSE