Suryaa.co.in

Features

మీ వ్యక్తిగతమైతే ఒక రూల్! దేశానిదైతే ఇంకొక రూలా?

జాతీయ జెండాను డీపీ గా పెట్టుకుంటే దేశభక్తి ఉన్నట్టా!?లేకపోతే లేనట్టా!?
ఈ దేశంలో పుట్టి,ఈ దేశపు గాలి పీలుస్తూ, ఈ దేశపు బువ్వ తింటూ,ఈ దేశపు నీళ్ళు తాగుతూ,ఈ దేశపు మట్టిలో కలిసిపోయే దేశ ద్రోహుల వింత ప్రశ్న!?
నిజమే మరి!?
ఒక ప్రశ్న మీ పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు,వీడియోలు స్టేటస్ లో పెట్టుకోవడం ఎందుకు!?
అలా పెట్టుకుంటేనే జరుపుకున్నట్లా!? లేకపోతే లేదా!? అందరికీ తెలియవలసిన అవసరం ఏముంది!?
మీ వ్యక్తిగతమైతే ఒక రూల్! దేశానిదైతే ఇంకొక రూల్ నా!?
ఏ పార్టీ వారు ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఎందుకు!? మీరు ఫలానా పార్టీ అని తెలియడానికే కదా! జాతీయ జెండాని డీపీ గా పెట్టుకోవడం కూడా అలాంటిదే..
జాతీయ జెండా ని డీపీ గా పెట్టుకోమనేది ఏదో సోకు కోసమో,ఇంకా దేని కోసమో కాదు.
మన జాతీయ జెండా రూప శిల్పి పింగళివెంకయ్య గారి శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ, ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, డీపీ గా పెట్టుకోవాలని మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అలా పెట్టుకోవడం వల్ల భారత దేశ ఐకమత్యాన్ని, మన జాతీయ జెండా విశిష్టతను, స్వాతంత్ర్యాన్ని సాధించుకోడానికి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ప్రపంచానికి తెలుస్తాయి.
పెట్టుకుంటే పెట్టుకోండి,లేకపోతే మానేయండి. అదేమి ఆర్డర్ కాదు,రిక్వెస్ట్ కాదు. అది పూర్తిగా మీ ఇష్టం,బలవంతం ఏమీ లేదు.
కానీ దేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ మాటను గౌరవిస్తూ,ప్రతి ఒక్కరం జాతీయ జెండాను డీపీగా పెట్టుకొని మన దేశభక్తిని,ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటుదాం.

– కేదార్‌నాధ్‌

LEAVE A RESPONSE