16నెలల జైల్లో చిప్పుకూడు తినొచ్చిన నువ్వు ఎన్టీఆర్ కుటుంబాన్ని క్రిమినల్స్ ఫ్యామిలీ అంటావా?
– విజయసాయిపై సోమిరెడ్డి ఫైర్
ఎన్టీఆర్ కుటుంబంపై బుదరజల్లడం నీ తరం కాదు కదా, నీ తాతల తరం కూడా కాదని తెలుసుకో వీసా రెడ్డీ…16 నెలల జైల్లో చిప్పుకూడు తినొచ్చిన నువ్వు మా నాయకుడి కుటుంబాన్ని క్రిమినల్స్ ఫ్యామిలీ అంటావా..మీ వివేకానందరెడ్డిని మీ మనుషులతోనే చంపించి గుండెపోటు అని నాటకాలేసిన నువ్వా ఎన్టీఆర్ కుటుంబసభ్యుల గురించి మాట్లాడేది.అప్పట్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి పెరట్లో పింక్ డైమండ్ ఉందని కూశావు…ఇప్పుడు నువ్వు నెత్తిన పెట్టుకోవున్న ధర్మారెడ్డి అసలు పింక్ డైమండే లేదంటున్నాడే..అయినా నీకు సిగ్గు రాలేదు…నీలాంటి నీచ చరిత్ర ఎన్టీఆర్ కుటుంబానికి లేదని గుర్తుంచుకో..నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మా ఎన్టీఆర్ కుటుంబానికి మరకలు అంటించలేవని తెలుసుకో..