Suryaa.co.in

Andhra Pradesh

పార్లమెంటు సభ్యుడు మాధవ్.. పోరంబోకు వేషాలు

– ప్రజల కోసం పోరాడి రికార్డులకెక్కాల్సింది పోయి.. పోర్న్ వీడియోలతో రికార్డులు సిగ్గుచేటు
– మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక పార్లమెంటు సభ్యుడు మహిళలతో అసభ్యకరంగా నగ్న వీడియో కాల్స్ చేస్తూ వేధించడం అత్యంత దుర్మార్గం. ప్రజల సమస్యల కోసం పని చేయాల్సిన పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. రెడ్ హ్యాండెడ్ గా వీడియోతో దొరికిపోయినప్పటికీ.. అది మార్ఫింగ్ వీడియో అంటూ తప్పించుకోవాలని ప్రయత్నిచి అడ్డంగా బుక్కయ్యారు.

పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాక ఏ రోజూ ప్రజా సమస్యలపై పోరాడిందీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కేంద్రాన్ని అడిగిందీ లేదు. కానీ.. తోటి ఎంపీలపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ, పారిశ్రామిక వేత్తల్ని బెదిరిస్తూ అసాంఘిక శక్తిగా నడుచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ పాడు పనులు చేసి రాష్ట్రం పరువు తీశారు. అలాంటి వ్యక్తికి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ వ్యవహారంపై మాధవ్ కోరినట్లుగా కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కళంకితులైన వ్యక్తులు చట్ట సభల్లో కొనసాగడానికి ఎంత మాత్రమూ అర్హత లేదు. తక్షణమే మాధవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి.

LEAVE A RESPONSE