పరిశ్రమల్లో భద్రతా ప్రమణాలపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకనే వరుస ప్రమాదాలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమలో ఇదే ఏడాది జూన్‌ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాటి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయింది.

అదే పరిశ్రమలో ఇప్పుడు మరోసారి వెలువడిన విషవాయువును పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి లోని బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ఈ ఏడాదే ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ లోని ఎల్‌జీ పాలిమర్స్‌ మొదలుకుని వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమై పోయింది.

కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.