రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే నక్సలైట్లు మేలనిపిస్తోంది

  • రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో విధ్వంసకాండ
  • గంజాయి సాగుతో దేశం మొత్తానికి సరఫరా చేస్తున్నారు
  • గోదావరి జిల్లాలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టారు
  • బీజెపికి కనీసం ఓట్లు వేయని రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎన్నో చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వ పాలన చూస్తుంటే నక్సలైట్లు మేలనిపిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్య చేశారు. జగన్ సామంతరాజులకు రాష్ట్రం అప్పచెప్పి, వారిచ్చే కప్పాన్ని లెక్కబెట్టుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రలో సాగవుతున్న గంజాయిని దేశం మొత్తానికి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓట్లు వేయకపోయినా, ప్రధాని మోదీ ఏపీకి వేల కోట్ల రూపాయల నిధులిస్తున్నారని వెల్లడించారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని, అమరావతికి తాము వ్యతిరేకమైతే ప్రధాని శంకుస్థాపనకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. అమరావతికి అనుకూలంగా బీజేపీ గుంటూరు జిల్లా నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపు సమావేశానికి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తేజపూరితంగా సాగిన ఆయన ప్రసంగం రైతుల్లో భరోసా నింపింది.

ఈ సందర్భంగా సత్య ఏమన్నారంటే… పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ కు వచ్చిన ఆలోచన తాడేపల్లి ఇంద్ర భవనంలోని నేతకు వచ్చినట్లు లేదు.లేకపోతే క్లౌడ్ బరస్ట్ చేసి మన సభను ఆపేసేవారు.ఈ రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో విధ్వంసకాండ.ఇన్ని రోజుల పాటు మహిళలను రోడ్డుపై ఉంచిన నాయకులను శపించాలి. అమరావతి రైతాలను చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది.ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వారిపై ఎందుకు కక్ష సాదిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.పులివెందులలో అభివృద్ధి పనుల కోసం జగన్ అక్కడి ప్రజలను భూములు అడిగితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనికి కారణం కూడా ఆయన తెలుసుకోలేకపోయారు. జగన్ వ్యతిరేకత కేవలం అమరావతి పైనే కాదు రాష్ట్రం పైనే కోపం పెంచుకున్నారు.

కడప జిల్లా సహా, రాష్ట్రం మొత్తంలో ఎక్కడా అభివృద్ధి చేయటం లేదురాష్ట్రం పై, రాష్ట్ర ప్రజలపై విద్వేషం పెంచుకున్నారు.ఓ సామాజిక వర్గం పై కక్ష పెంచుకున్నారు.అమరావతిలో మొత్తం ఆ సామాజిక వర్గమే ఉన్నారా? అమరావతి అభివృద్ధి చెందితే అందరికీ మేలు జరిగేది.ముఖ్యమంత్రి తన సామంత రాజులకు ఒక్కో ప్రాంతాన్ని కట్టబెట్టారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగుతో దేశం మొత్తానికి సరఫరా చేస్తున్నారు. సామంత రాజులు కప్పం కడితే దాన్ని లెక్క పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే నక్సలైట్లు మేలనిపిస్తోంది.గోదావరి జిల్లాలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టారు.

ఇలా అన్నిచోట్లా కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధం. ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంరక్షకునిగా ఉండాలి.. 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు సీట్లు గెలిపించిన ప్రజలపై కోపం పెంచుకుంటే… బీజెపికి కనీసం ఓట్లు వేయని రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎన్నో చేశారు.విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి తేవటంలో వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి కీలక పాత్ర. అమరావతి విషయంలో చిత్తశుద్ధి లేకపోతే శంకుస్థాపనకు ఎందుకు వస్తారు? రాష్ట్రంలో ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పనకు వేల కోట్లు ఎందుకు ఇస్తారు? అమరావతి పైన చిత్తశుద్ధి లేకపోతే ఎందుకు అన్ని పథకాలు మంజూరు చేస్తారు? క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేసింది మోదీ ప్రభుత్వానిదే. ఓట్లు వేసినా వేయకపోయినా నిజమైన సంరక్షకునిగా మోదీ పని చేశారు.

పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళడం సిఎం వల్ల కాదని అప్పుడే చెప్పా
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ
kanna-gntఇక్కడ నుండి పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళడం సిఎం వల్ల కాదని అప్పుడే చెప్పాను. అన్ని రాజకీయ పార్టీలను నమ్మి రైతులు భూములను త్యాగం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి కేంద్రం వేల కోట్ల నిధులిచ్చింది. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారితే రాష్ట్ర అభివృద్ధికి చేటని తెలియని ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం. నేను బిక్ష వేస్తాను ఆ బిక్ష తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారని సిఎం భావిస్తున్నారు అది ఎంతో కాలం సాగదు. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు.

జగన్ రాజకీయాల నుండి బయటకు పంపాలి: కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి
sujana1అమరావతి అనే రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినది కాదు.దొంగతనంగా బిల్లు తీసుకురావటానికి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు.రాష్ట్రమంతా రాజధాని ప్రాధాన్యం గురించి తెలియజెప్పాల్సిన అవసరం జేఎసి పై ఉంది. చంద్రబాబు గౌరవనీయ నాయకుడే..‌ దూషించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ రాజకీయాల నుండి బయటకు పంపాలి. బీజేపీ నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టికీ ఆపాదించ వద్దు. 2024లో తిరిగి పొరపాటు జరిగితే భగవంతుడి కూడా కాపాడలేడు. ఎవరూ వచ్చిన అగౌరవ పర్చవద్దు.

రైతులను మోసం చేయటం అంటే తల్లి, చెల్లి, భార్యను మోసం చేసినట్లే
– మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మారం అమరావతి రైతులను మోసం చేయటం.రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మోసం చేయటం అంటే తల్లి, చెల్లి, భార్యను మోసం చేసినట్లే.అసెంబ్లీలో అమరావతికి మద్దతిస్తానని జగన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఎన్నికలకు ముందు ఓ మాట తర్వాత ఓ మాట జగన్ ది.సొంత పార్టీ వారు నిజాలు మాట్లాడితే వారిని కూడా వదిలిపెట్టకుండా జైల్లో వేయించారు. రఘురామకృష్ణరాజు వ్యవహారం అందుకు నిదర్శనం. దేశం అంతా 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం చేస్తుంటే.. ఏపీలో మాత్రం కనీసం మాట్లాడే స్వాతంత్య్రం లేదు.

కేంద్రం ఇచ్చిన ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి
– మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్
మూడు రాజధానుల నిర్ణయం వైసీపీ వారికి కూడా ఇష్టం లేదు.కేవలం స్టేజ్ పైన మాత్రమే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు.విశాఖలో రుషికొండ ను నాశనం చేశారు. రహస్యంగా అక్కడ పనులు చేస్తున్నారు. చక్కగా జరుగుతున్న రాజధాని పనులను నాశనం చేశారు. మనం శాశ్వతం కాదు. రాజధాని శాస్వతం. రాజధాని ఎందుకు మారుస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి. అమరావతి విషయంలో బిజెపి నిర్ణయం స్పష్టంగా ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని బిజెపి తీర్మానం చేసింది. రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు. ఎప్పుడో కేంద్రం ఇచ్చిన ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి. మద్యపాన నిషేధం విషయంలో అన్నీ అబద్దాలే.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఏమన్నారంటే… అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడుతాం.రైతుల మీద లాఠీ ఎత్తాలంటే బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఎత్తాల్సి ఉంటుంది. బిజెపి ఒకసారి తీర్మానం చే‌స్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. అమరావతే ఏకైక రాజధాని. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.

valluri1వల్లూరు జయ ప్రకాష్ నారాయణ ఏమన్నారంటే… మరో ఏడాది పాటు పోరాటం చేస్తే రాష్ట్రానికి పట్టిన పీడ పోతుంది.బిజెపి ఒకే మాట, ఒకే బాట… అమరావతి కే బిజెపి కట్టుబడి ఉంది. అమరావతి సాధించే వరకూ పోరాడుతాం. ముగింపు సభలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి , జూపుడి రంగరాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, బిట్రా శివన్నారాయణ, లంకా దినకర్, మండల అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ,గుడిసె దేవానంద్,దారా సాంబయ్య, బొబ్బూరి శ్రీరామ్, జేఏసీ నాయకులు తిరుపతిరావు,పువ్వాడ సుధాకర్, బిజెపి నాయకులు జమ్ముల శ్యాంకిషోర్, కొమ్మినేని సత్యనారాయణ, పాలపాటి రవికుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి, కుమార్ గౌడ్, భాస్కర్, వనమా నరేంద్ర ఇతర బిజెపి నాయకులు అమరావతి రైతులు పాల్గొన్నారు.

Leave a Reply